Homeలైఫ్ స్టైల్Life Style : ఈ అలవాట్లు మీకు ఉంటే ఎంత సంపాదించినా పేదవారుగానే ఉంటారు.. అయితే...

Life Style : ఈ అలవాట్లు మీకు ఉంటే ఎంత సంపాదించినా పేదవారుగానే ఉంటారు.. అయితే ఏం చేయాలి?

Life Style  : ప్రతి ఒక్కరికి జీవితంలో పైకి ఎదగాలని ఉంటుంది. అందరితో సమానంగా డబ్బు సంపాదించి సంతోషంగా జీవించాలని కోరుకుంటారు.. కానీ కొందరు మాత్రమే డబ్బు సంపాదించి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. అయితే వారు ప్రత్యేకమైన అలవాట్లను కలిగి ఉండి.. కొన్ని దురాలవాట్లను దూరం చేసుకోవడం వల్లనే అనుకున్నది సాధించగలుగుతారు. ఆ తర్వాత కష్టపడి పని చేస్తారు. డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాలు దొరకడమే కాకుండా మనిషిలోని కొన్ని గుణాలను కలిగి ఉండడం వల్ల జీవితంలో పైకి ఎదుగుతారు. ఇదే సమయంలో కొన్ని అలవాట్లను మానుకోవడం చేయాలి. అలా చేయకపోతే ఇంత డబ్బు సంపాదించినా పేదవారిగానే మిగిలిపోతారు. అలా దూరం పెట్టే అలవాట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

Also Read : ఇంట్లో మొక్కలను పెంచుతున్నారా? వీటిని తప్పకుండా ఉంచండి..

కొందరు డబ్బు సంపాదించడానికి ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. తాత్కాలికంగా డబ్బు సంపాదించడానికి చేతికి వచ్చిన పనిని చేస్తూ పోతారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోకుండా ఇష్టం వచ్చినట్లు పనిచేయడం వల్ల అది ఎప్పటికైనా అనర్ధమే. ఎందుకంటే జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసం పనిచేసుకుంటూ పోతే ఎప్పటికైనా దానిని సాధించి అధికంగా డబ్బు సంపాదించి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ.. తాత్కాలికంగా డబ్బు సంపాదించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.అందువల్ల జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసం కష్టపడుతూ ఉండాలి.

పనులు అందరూ చేస్తారు. కానీ కొందరు మాత్రమే జీవితంలో ఎదుగుతారు. వీరిని చూసి ఇతరులు అసూయపడతారు. అయితే అయితే కొన్ని రిస్కులు తీసుకోకుండా ఉండటంవల్ల వీరు అక్కడే ఉండిపోతారు. మిగతావారు మాత్రం రిస్కులు తీసుకొని ఎక్కువ పనులు చేస్తారు. ఉదాహరణకు కొందరు ఉద్యోగులు తాము చేసే పరికంటే అదనంగా కొన్ని పనులు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. ఇలా తక్కువ సమయం లో ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ జీవితంలో ఉన్నత స్థాయికి వెతుకుతారు. కానీ మరికొందరు మాత్రం అలా చేయకుండా వచ్చిన డబ్బుతో సరిపెట్టుకుంటూ ఉండాలని అనుకుంటారు. ఇలాంటి లక్షణం ఉన్నవారు జీవితంలో ఎప్పటికైనా పైకి ఎదగలేరు.

నేటి కాలంలో చాలామంది చేసే ప్రధాన తప్పు ఏంటంటే ఆదాయానికి మించిన ఖర్చులు చేయడం. తక్కువ ఆదాయం వచ్చి ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల ఎప్పటికైనా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లలేరు. అందువల్ల దుబార ఖర్చులను ఎక్కువగా చేయకుండా తక్కువ ఖర్చు చేస్తూ మిగిలిన డబ్బులు పొదుపు చేస్తూ పోవాలి. ఇలా చేయడం వల్ల తొందర్లోనే అనుకున్న స్థాయికి వెళ్తారు.

వ్యక్తిగతంగా కొందరు చాలామంది తమ అభివృద్ధి గురించి ఎక్కువగా పట్టించుకోరు. మాటలను అదుపులో ఉంచుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అలా చేయడంవల్ల సమాజంలో గుర్తింపును కోల్పోతారు. దీంతో ఇతరుల సహాయం పొందకుండా ఉంటారు. అయితే ఇలా కాకుండా మంచి మాటలతో అందరినీ ఆకట్టుకోవాలి. అప్పుడే ఇతరుల సహాయంతో అభివృద్ధిని సాధించగలరు.
Also Read : ఈ లోహాలు మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులే!

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version