LIC Super Policy: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ పేరుతో ఎల్ఐసీ ఈ పాలసీని అమలు చేస్తోంది. ఈ పాలసీ తర్వాత మెచ్యూరిటీ తర్వాత ఎన్నో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ఏ విధమైన బెనిఫిట్స్ ను పొందుతామో ఈ పాలసీతో కూడా అదే తరహా బెనిఫిట్స్ ను పొందవచ్చు.
90 రోజుల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పాలసీకి గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 75 సంవత్సరాలుగా ఉంది. మూడు రకాల వ్యక్తులు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండేవాళ్లు, ఏదైనా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేవాళ్లు, భారీ మొత్తంలో వారసత్వంగా డబ్బులు పొందిన వాళ్లు ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు.
10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఈ పాలసీ వ్యవధిగా ఉంది. కనీస బీమా 50,000 రూపాయలు ఉండగా ఈ పాలసీలకు గరిష్ట పరిమితి లేదు. 30 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి 25 సంవత్సరాల కాలానికి 2 లక్షల రూపాయలకు పాలసీని తీసుకుంటే సింగిల్ ప్రీమియంగా జీఎస్టీతో కలిపి 93,193 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత ఏకంగా 5.5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.
పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే చనిపోతే నామినీ పాలసీ యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. రోజుకు 11 రూపాయల చొప్పున సంవత్సరానికి 4,000 రూపాయల లోపు ఆదా చేసే మొత్తం ప్రీమియంగా చెల్లించడం ద్వారా ఏకంగా ఐదున్నర లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.