IPL 2022 CSK vs LSG: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఉన్న చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న టీమ్. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా గెలవగలిగే నైఫున్యం ఉన్న ఆటగాళ్లు ఈ జట్టు సొంతం. పటిష్టమైన బ్యాటింగ్‌తో పాటు.. పదునైన బౌలింగ్ సీఎస్‌కే కు ఉన్నాయి. కానీ ఐపీఎల్ 15వ సీజన్‌లో దారుణమైన చెత్త రికార్డులను నెలకొల్పుతోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటతీరును కనబరుస్తోంది. ఫలితంగా రెండో మ్యాచ్‌లో కూడా ఓడిపోయింది. ఈ సీజన్ లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ మీద దారుణంగా ఓడిపోయింది. మొదటి మ్యాచ్‌ను కోల్‌కతా చేతిలో కోల్పోయిన సీఎస్కే.. ఇప్పుడు మరోదెబ్బ తిన్నది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై బాగానే స్కోర్ చేసింది.
Also Read: MGM Hospital: మేం రాము బిడ్డో తెలంగాణ సర్కార్ దవాఖన్లకు..
రాబిన్ ఊతప్ప50 పరుగులతో ఆకట్టుకోగా.. శివమ్ దూబే 49, మొయిన్ అలీ 35 పరుగులతో అండగా నిలబడ్డారు. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కూడా 27 పర్వాలేదనిపించాడు. మొత్తంగా సీఎస్‌కే 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అయితే ఇంతటి భారీ స్కోర్‌ను కూడా కాపాడలేకపోయారు బౌలర్లు. దారుణమైన బౌలింగ్ తో ఓటమికి కారణం అయ్యారు.
లక్నో జట్టు 19.3 ఓవర్లలోలోనే కేవలం 4 వికెట్లను కోల్పోయి 211 పరుగులు చేసి విజయకేతనం ఎగరేసింది. ఈ టీమ్ లో ఎవిన్ లూయిస్ 55 పరుగలకు తోడు ఓపెనర్ క్వింటన్ డికాక్ 61 పరుగులతో జట్టుకు బలమైన లైనప్ వేశారు. ఇంకేముంది వీరి తర్వాత వచ్చిన వారిపై ప్రెషర్ లేకపోవడంతో బాగానే రాణించారు. ఇక చివరలో ఆయుష్ బదోని దుమ్ము లేపాడు. అతను కేవలం తొమ్మిది బంతుల్లోనే 19(2 సిక్సర్లు) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

రవీంద్ర జడేజా కెప్టెన్సీలో మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. అతను బౌలింగ్ లో కూడా దారుణంగా ఫెయిల్ అయయాడు. వేసిన రెండు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చాడు. ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే కూడా దారుణంగా పరుగులు ఇచ్చేశారు. అయితే 19 ఓవర్లో ఫలితం మారిపోయింది. ఆ ఓవర్ వేసిన శివమ్ దుబే 25 పరుగులు ఇవ్వడంతో జట్టుకు విజయం దూరమయింది.
అయితే ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఇలా వరుసగా తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఇంత చెత్త రికార్డు ఇప్పటి వరకు ఈ టీమ్ పేరు మీద లేదు. ప్రస్తుతం ఈ టీమ్ చివరి స్థానంలో ఉంది. ఇక ఎల్లుండి పంజాబ్ కింగ్స్‌తో ఆడోబోతోంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ఉంటుంది. మరి అందులోనైనా గెలుస్తుందో లేదో చూడాలి.
Also Read: Nara Lokesh: జనం చెవిలో జగన్ పూలు.. లోకేష్ సెటైరికల్ ట్వీట్.. మార్పు మొదలైందా..?
[…] […]