MGM Hospital: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కరువవుతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందు పడులుతున్నారు. గతంలో కూడా ఆస్పత్రుల తీరుపై విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. పారిశుధ్యం సమస్యతో పురుగు పుట్ర రోగులను ఇబ్బందులు పెడుతున్నా సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగిని ఎలుగుకలు కొరికి గాయపరచడం సంచలనం సృష్టిస్తోంది. దవాఖానాల్లో భద్రత ఇంత దారుణంగా ఉందనే విమర్శలు సైతం వస్తున్నాయి.

హైదరాబాద్ లో నాలుగు, వరంగల్ లో ఒక ఆస్పత్రి ఉన్నాయి. ఇక్కడ రోగులకు మాత్రం సేవలు అంతంత మాత్రమే అని తెలుస్తోంది. గత తాలూకు ఘటనలు కూడా ఉన్నా సిబ్బందిలో అలసత్వమే కనిపిస్తోంది. ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు కరువవుతున్నాయి. ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వంద మంది పనిచేయాల్సిన చోట 40 మంది పనిచేస్తున్నారని తెలుస్తోంది. అందుకే సేవలు రోగులకు అందడం లేదని తెలుస్తోంది.
Also Read: Nara Lokesh: జనం చెవిలో జగన్ పూలు.. లోకేష్ సెటైరికల్ ట్వీట్.. మార్పు మొదలైందా..?
ఆస్పత్రుల్లో బొద్దింకలు, నల్లులు కూడా రోగులకు కష్టాలు పెడుతున్నాయి. మరుగుదొడ్లు అయితే అపరిశుభ్రంగా వాసన కొడుతూ రోగులకు చుక్కలు చూపెడుతున్నాయి. ఇక వార్డుల నిర్వహణ అయితే చెప్పనవసరం లేదు. హైదరాబాద్ లోని నీలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో కుక్కలు, పందులు సంచరిస్తూ రోగులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు.

ఇక ఈగలు, దోమలు అయితే చెప్పనవసరం లేదు. ఆస్పత్రుల్లో కనిపిస్తున్న సదుపాయాలు రోగులకు సంతృప్తిగా ఉండటం లేదు. ఫలితంగా వారు తిప్పలు పడుతున్నారు. అసౌకర్యానికి గురవుతున్నారు. అయినా సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల డొల్లతనం గురించి చర్చించే అవసరం లేకుండా పోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి.
Also Read: Telangana Cabinet Expansion: కేసీఆర్ కుటుంబంలో మరో నిరుద్యోగికి ఉద్యోగం!
[…] Also Read: MGM Hospital: మేం రాము బిడ్డో తెలంగాణ సర్కార్ … […]