Business Ideas: ఈరోజుల్లో బిజినెస్ ప్రారంభించాలంటే మినిమం రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అయితే కనీసం రూ.2 లక్షలు పెట్టుబడితో మంచి లాభాలు పొందే బిజినెస్ గురించి మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మార్కెట్‌లో స్నాక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. కిరాణా షాపు చూసినా, ఫ్యాన్సీ షాపు చూసినా.. టీ షాపు చూసినా.. ఇలా ఎక్కడ చూసినా స్నాక్స్ ప్యాకెట్లను వ్యాపారులు విక్రయిస్తుంటారు. సీజన్‌తో సంబంధం లేకుండా స్నాక్స్ ప్యాకెట్లు అమ్ముడుపోతుంటాయి.

ఏ మాత్రం లాభం లేకుండా స్నాక్స్‌ను వ్యాపారులు విక్రయించడానికి ఇష్టపడరు. మరి ప్రతి వ్యాపారి స్నాక్స్‌ను విక్రయిస్తున్నారంటే వాటికి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్నాక్స్‌లో నామ్‌కీన్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. ఎక్కువగా ప్రయాణాల్లో ప్రజలు వీటిని కొనుగోలు చేస్తారు. నామ్‌కీన్ అంటే మిక్చర్ అన్నమాట. అయితే నామ్‌కీన్ బిజినెస్ ఐడియా వర్కవుట్ అయితే మంచి లాభాలను గడించవచ్చు. ఇది వర్కవుట్ కావాలంటే మీరు మంచి రుచి అందించగలగాలి.
Also Read: Anchor Shiva Jyothi: మీకో దండంరా బాబు.. మీరంతా నన్ను తల్లిని చేస్తున్నారు !
నామ్‌కీన్ తయారీకి కొంత మిషనరీ అవసరం అవుతుంది. సెవ్ మేకింగ్ మెషిన్, ఫ్రైయర్ మెషిన్, మిక్సింగ్ మిషన్, ప్యాకేజింగ్, వెయింగ్ మెషిన్ అవసరం. ఈ వ్యాపారం కోసం చిన్న దుకాణం లేదా ఫ్యాక్టరీని ప్రారంభించడానికి 300 చదరపు అడుగుల నుంచి 500 చదరపు అడుగుల స్థలం అవసరం. ఫ్యాక్టరీ పాస్ పొందడానికి ప్రభుత్వ అనుమతి కూడా పొందాలి. ఫుడ్ లైసెన్స్, MSME రిజిస్ట్రేషన్, GST రిజిస్ట్రేషన్ వంటివి తప్పనిసరిగా ఉండాలి.

అంతేకాకుండా ఈ వ్యాపారానికి కనీసం 5-8 కిలోవాట్ల విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మిక్చర్ తయారీకి నూనె, శెనగలు, మైదా, ఉప్పు, మసాలాలు, వేరుశెనగలు, పప్పులు వంటి సామగ్రి కావాలి. పనిచేయడానికి ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులు కూడా అవసరం. ఇవన్నీ కావాలంటే కనీసం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా అయితే రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రజల ఆదరణ లభిస్తే కొద్ది రోజుల్లోనే ఖర్చులో 20 నుంచి 30 శాతం లాభం పొందవచ్చు.
Also Read:Electric Three Wheeler Factory : తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద త్రీవీలర్ ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీ..
Recommended Videos