Learn to Say No: జీవితం సంతోషమయంగా మారడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులను అలవర్చుకోవాలి. మనకు ఇష్టం లేని కొన్ని పనులను కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఇవి ఇష్టం లేకుండా ఒక్కోసారి మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. చాలామంది కొన్ని విషయాల్లో మొహమాటపడుతూ ఉంటారు. కొన్ని విషయాలు మాట్లాడడానికి వెనుకడుగు వేస్తారు. ముఖ్యంగా ఎవరైనా అప్పు అడిగితే లేదు.. కుదరదు.. అని చెప్పడానికి ఇబ్బందులు పడతారు.. ఇలాగే కార్యాలయాల్లో.. ఇంట్లో కొన్ని పనుల విషయంలో సాధ్యం కానప్పుడు కుదరదు అనే మాట వాడడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Also Read: ఉత్సాహంగా పని.. ఆనందంగా జీవితం.. ఈ దేశాన్ని చూసి నేర్చుకోవాలి..
ఒక ఉద్యోగి కార్యాలయంలో తమ విధులను నిర్వహిస్తున్నాడు. ఇలాంటి సమయంలో తనకు ఒక ప్రాజెక్టు అప్పచెప్పారు. అయితే ఆ ఉద్యోగి ఆ ప్రాజెక్టును పూర్తిచేసే సామర్ధ్యాన్ని కలిగి లేడు. అయినా కూడా మొహమాటంతో ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ సమయానికి దానిని పూర్తి చేయలేక ఇబ్బందులు పడతాడు. అయితే తాను ఈ ప్రాజెక్టును చేయలేను అని అనుకున్నప్పుడు కుదరదు లేదా చేయలేను అని చెబితే ఎలాంటి ఒత్తిడి ఉండదు. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉండదు.
అలాగే ఒక ఉద్యోగి మేనేజర్ స్థాయిలో ఉన్నాడు. అయితే కిందిస్థాయికి ఉద్యోగికి చెందిన ఒక పనిని అతనికి అప్పగించకుండా తానే చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు తన సొంత పని వెనుకబడిపోయింది. అలా తన పనిని కాకుండా కిందిస్థాయి ఉద్యోగి పని కూడా తానే చేస్తానని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అందువల్ల పనిని షేర్ చేసుకొని ఇతరులతో చేయించడం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా సమయానికి అనుగుణంగా ఈ పని పూర్తయ్యే అవకాశం ఉంది..
Also Read: ఎట్టకేలకు ఇండియాలో టెస్లా.. ముంబైలో షోరూం స్పెషాలిటీ ఇదే
ఒక ఉద్యోగికి తన కార్యాలయంలో ఎంత పనిని అప్పగిస్తారో.. అంతే పనిని చేయాలి. తన స్థాయికి మించి చేయాలని అనుకోవడం కూడా అంతా మంచిది కాదు. ఎందుకంటే తన స్థాయికి మించి పనులు చేయడం వల్ల మానసికంగా భారం పెరుగుతుంది. దీంతో అసలు పని చేయలేక పోతాడు. ఫలితంగా రెండు విధాలుగా నష్టపోయే అవకాశం ఉంది.
ఇక మరికొన్ని విషయాల్లో కూడా సాధ్యం కానీ పనులకు నో చెప్పడమే అలవాటు చేసుకోండి. ఇది కాస్త ఇబ్బంది అనిపించినా ఆ తర్వాత ఆరోగ్యకరమే అని తెలుస్తుంది. ఎందుకంటే అనవసరపు పనులు మీద వేసుకోవడం వల్ల ఒత్తిడి పెరిగి గుండె సమస్యలు వస్తాయి. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఇవే కాకుండా ఎవరు ఏ పనిలో మునిగి ఉన్నా.. వాటికి కాస్త బ్రేక్ ఇస్తూ ఉండాలి. ఇలా బ్రేక్ ఇవ్వకుండా నిరంతరాయంగా పనిచేయడం వల్ల తీవ్రమైన స్పేస్ తో ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయలేక పోతారు. అంతేకాకుండా మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మధ్య మధ్యలో కాస్త రిలాక్స్ అయితే వర్క్ విజయవంతంగా పూర్తి అవుతుంది.