Salary Increment In India: కొవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో ఉద్యోగులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ ఆ ప్రభావం కొంత మేరకు ఉంది. ఇకపోతే చాలా మంది ప్రైవేటు ఉద్యోగులు ఏకంగా ఉద్యోగాలే కోల్పోయారు. వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిని నష్టం ఏర్పడింది. దాంతో ఇక ఉన్న ఉద్యోగాలే ఊడిపోగా వేతనాల పెరుగుదల అనే ఆలోచన రాకుండా అయిపోయింది. కాగా, తాజాగా వేతనాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయనే విషయం తెలుసుకునేందుకుగాను కార్న్ కార్న్‌ఫెర్రీ ఇండియా వార్షిక రివార్డ్ సర్వే చేసింది. సర్వే అనంతరం పలు విషయాలను తెలిపింది.

మన దేశంలో ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ వేతనాల పెరుగుదల జరిగిందని తేలింది. జీతం ఇంక్రిమెంట్లు ఈ ఏడాది కూడా ఉంటాయని చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం..2021లో వేతనాల సగటు పెంపు 8.4 శాతం ఉండగా, ఈ ఏడాది సగటు వేతన పెంపుదల 9.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఇకపోతే కొవిడ్‌కు ముందర అనగా 2019లో సగటు వేతన పెంపు 9.25 శాతంగా ఉందని సర్వేలో నిర్ధారించారు.
Also Read: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. త్వరలోనే మళ్లీ మునపటి పరిస్థితులు..
ఇకపోతే కొవిడ్ మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. నిజంగానే కేసులు కూడా పెరుగుతున్నాయి. కానీ, ఈ కేసులు తగ్గుముఖం పడుతాయని, వ్యాపార చక్రంపైన కొవిడ్ ప్రభావం చూపే చాన్సెస్ తక్కువగా ఉంటాయని సర్వే స్పష్టం చేస్తోంది. కొవిడ్ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని అంచనాలు కూడా ఉన్నాయి. గతేడాది అనగా 2020-2021 ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం అనగా 2022 ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉందని సర్వేలో స్పష్టమైంది.
ఇకపోతే పరిశ్రమ నిపుణులు కూడా ఇంక్రిమెంట్ల గురించి చెప్తున్నారు. వేతనాల పెంపు ద్వారా ఉద్యోగుల పనితీరులో ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. చాలా వరకు ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ ఉన్న చోట ఎక్కువగా పని చేస్తున్నారని అంటున్నారు. ఇకపోతే లక్ష్య సాధనలో సంస్థ ముందుకు వెళ్లాలంటే కనుక ఉద్యోగులందరీకి మెరుగైన వేతనాలుండాలనేది ఎవరూ కాదనలేని సత్యం. ఇకపోతే చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు వేతనాల పెరుగుదల కోసం వేచి చూస్తున్నారు.
Also Read: టాప్ అప్ లోన్ అంటే ఏంటో తెలుసా.. ఈ లోన్ వల్ల కలిగే ప్రయోజనాలివే!
[…] Also Read: దేశంలో వేతనాల పెరుగుదల.. ఎంత శాతమంటే? […]