Homeజాతీయ వార్తలుBandi Sanjay: క‌రీంన‌గ‌ర్ లో బండి సంజ‌య్ సీటు మార‌నుందా?

Bandi Sanjay: క‌రీంన‌గ‌ర్ లో బండి సంజ‌య్ సీటు మార‌నుందా?

Bandi Sanjay: తెలంగాణ బీజీపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పార్టీని ప్ర‌గ‌తిప‌థంలో న‌డిపించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే వ్యూహంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇందులో భాగంగా ప్ర‌తిప‌క్షాల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. వారి బ‌ల‌హీన‌త‌లే ల‌క్ష్యంగా ముందుకు క‌దులుతున్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య‌తీరాల‌కు న‌డిపించాల‌ని భావిస్తున్నారు. దీని కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. కేంద్రం కూడా సంజ‌య్ పై పూర్తి విశ్వాసం వ్య‌క్తం చేస్తంది. రాష్ట్రంలో పార్టీని గెలుపు బాట ప‌ట్టించాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. దీని కోసం కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ప్ర‌క‌టిస్తున్నారు. ఇప్ప‌టికే పాద‌యాత్ర‌ల‌తో ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పెంచిన సంజ‌య్ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో బండి సంజ‌య్ పార్టీని ముందుండి న‌డిపిస్తున్న తీరుకు కేంద్రం కూడా ఆయ‌న‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.

Bandi Sanjay
Bandi Sanjay

అయితే ఆయ‌న గ‌తంలో క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా విజ‌యం వ‌రించ‌లేదు. దీంతో పార్ల‌మెంట్ బ‌రిలో నిలిచి అనూహ్యంగా బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీ సాధించి అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేశారు. ప్ర‌స్తుత ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ పై విజ‌యం సాధించారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి బాధ్య‌త‌లు స్వీక‌రించి పార్టీని విజ‌యవంతంగా నడిపిస్తున్నారు. దుబ్బాక‌, జీహెచ్ ఎంసీ, హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో పార్టీని విజ‌యం సాధించేలా చేశారు. సంజ‌య్ నేతృత్వంలోనే పార్టీ ముందంజ‌లో న‌డుస్తుంద‌ని నిరూపించారు. దీంతో పార్టీలో ఆయ‌న‌కు తిరుగులేని నేత‌గా ఎదుగుతున్నారు.

Also Read: కాళేశ్వరంలో అవినీతి చేపలు.. విచారణ జరపాలంటున్న రేవంత్ రెడ్డి..
క‌రీంన‌గ‌ర్ కాకుండా వేముల‌వాడ నుంచి పోటీ చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌రీంన‌గ‌ర్ లో మైనార్టీ ఓట్లు బాగుండ‌టంతో సంజ‌య్ వేముల‌వాడ వైపు చూస్తున్న‌ట్లు భావిస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందో అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుత ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్ పై ఎన్నిక‌ల సంఘం ఎప్పుడు వేటు వేస్తుందో తెలియ‌డం లేదు. దీంతో వేముల‌వాడ‌లో పాగా వేయాల‌ని బీజేపీ భావిస్తోంది. అందుకే వేముల‌వాడ‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కానీ బండి సంజ‌య్ వ్యూహాల‌తో బీజేపీ మాత్రం తెలంగాణ‌లో త‌న‌కంటూ ఓ ఇమేజ్ సంపాదించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో బీజేపీ రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికార‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో కాంగ్రెస్ సైలంట్ అయిపోయింది. ఇక టీఆర్ఎస్ పై కూడా వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది. దీంతో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం తామేన‌ని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన సంద‌ర్భంలో బీజేపీ ని అధికారంలో తీసుకొచ్చేందుకు ప‌లు మార్గాలు వెతుకుతోంది. కుటుంబ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని ఇదివ‌ర‌కే ప‌లు స‌భ‌ల్లో చాటిన సంజ‌య్ టీఆర్ఎస్ ను క‌ట్ట‌డి చేసేందుకు ఏ మార్గాలు వెతుకుతారో చూడాలి. ఏదిఏమైనా రాష్ట్రంలో బీజేపీని విజ‌యం వైపు న‌డిపించేందుకు బండి సంజ‌య్ మ‌రిన్ని వ్యూహాల‌కు ప‌దును పెడ‌తార‌నేది స‌త్య‌మే. దీని కోసం కేంద్రం కూడా ప‌చ్చ‌జెండా ఊపింది. దీంతో బీజేపీ విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కే అన్న‌ట్లుగా ఉంటుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Also Read: నీ ప్రేమ సల్లగుండ కేసీఆర్ సార్.. మొగిలయ్య దరిద్రం పోగొట్టావ్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version