NTR – Krishna: ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్య పోటీ అనేది ఉంటుంది. ఆ హీరో ఏం చేస్తే ఈ హీరో కూడా అదే చేయాలని అనుకుంటారు. అలా ఇప్పుడే కాదు ఐదు దశాబ్దాల కింద నుంచే ఇటువంటి పోటీలు ఉండేవి. అయితే ఐదు దశాబ్దాల కిందట సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ గట్టి పోటీలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరి మధ్య నడిచిన పోటీ చూస్తే మాత్రం అందరూ షాక్ అవుతారు. ఎన్టీఆర్ హిట్ సినిమా చేస్తే వెంటనే కృష్ణ కూడా అదే హిట్ సినిమాలు చేసేవారు.

Also Read: యాంకర్ రష్మీ కెరీర్ నాశనం చేసిన యంగ్ హీరో
ఆయన సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో.. కృష్ణ కూడా తన సినిమాలను అప్పుడే విడుదల చేయించేవారు. ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల్లో నటిస్తే.. కృష్ణ కూడా అలాంటి సినిమాల్లో నటించేవారు. అప్పట్లో కృష్ణకు రాజకీయంపై ఎక్కువగా అవగాహన లేదు. కానీ ముందు చూపుతోనే రాజకీయం పై దృష్టి పెట్టిన ఎన్టీఆర్ తెలుగుదేశంలో చేరడంతో.. కృష్ణ కాంగ్రెస్ లో చేరాడు. అయితే కృష్ణ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఈనాడు సినిమాలో నటించగా అది ఎన్టీఆర్ కు సహాయపడింది.
ఆ తర్వాత కృష్ణ రాజకీయాలకు దూరంగా ఉండటంతో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పిలవడంతో మళ్లీ కృష్ణ రాజకీయంలోకి చేరాడు. ఆ సమయంలో కృష్ణకు రాజకీయం పై మంచి అవగాహన ఏర్పడింది. దీంతో ఎలాగైనా తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి కొన్ని సినిమాలు చేశాడు. అందులో సింహాసనం, మండలాధీశుడు, నా పిలుపు ప్రభంజనం, గండిపేట రహస్యం, సాహసమే నా ఊపిరి వంటి సినిమాలలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చేశాడు.
Also Read: మహేశ్ కుటుంబానికి పవన్ క్రిస్మస్ స్పెషల్ గ్రీటింగ్స్!