Natural Star Nani: హీరో నాని ధైర్యానికి పవన్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ లో ఉన్న రియల్ హీరో నాని అంటూ పొగిడేస్తున్నారు. మీ తెగువకు సలాం.. అస్సలు వెనక్కి తగ్గొద్దు, మీ వెనుక మేమున్నాం అంటున్నారు. నానిపై పవన్ ఫ్యాన్స్ ప్రేమకు కారణం.. ఆయన నిన్న ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమే. టికెట్స్ ధరల విషయంలో మూడు నెలలుగా సందిగ్ధత కొనసాగుతుంది. పరిశ్రమ పెద్దలు పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో థియేటర్స్ నిర్వహణ సాధ్యం కాదని, ఇది చిత్ర పరిశ్రమ మనుగడకే ప్రమాదం అంటున్నారు. సినిమా టికెట్స్ ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35ని ఏపీ హైకోర్టు రద్దు చేసింది. అయితే ప్రభుత్వం అప్పీల్ కి వెళ్లగా.. విచారణ జనవరి 4న జరగనుంది. తీర్పు వెలువడే వరకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలులో ఉంటాయి.
Also Read: నాని వ్యాఖ్యల వల్ల స్టార్ హీరోలకే ఇబ్బంది !
ఈ నేపద్యంలో డిసెంబర్ 24న శ్యామ్ సింగరాయ్ విడుదల కానుంది. ప్రస్తుత రేట్లు ఈ మూవీ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దీంతో హీరో నాని మీడియా వేదికగా తన అసహనం వెళ్లగక్కారు. కిరాణా కొట్టు వసూళ్ల కంటే దారుణంగా సినిమా థియేటర్స్ వసూళ్లు ఉంటున్నాయని ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. సినిమాటోగ్రఫీ చట్టంలో కొత్తగా పొందుపరచిన టికెట్స్ ధరలు, ఆన్లైన్ అమ్మకాలు , బెనిఫిట్ షోల రద్దుపై పవన్ కళ్యాణ్ మొదటిసారి వ్యతిరేకత వ్యక్తం చేశారు.
పరిశ్రమలో ఉన్న మిగతా స్టార్ హీరోలు మౌనం వహిస్తున్న తరుణంలో నాని ఓపెన్ గా మాట్లాడడం, పవన్ పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. నానికి సప్పోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై వ్యతిరేక గళం విప్పిన నాని ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఫేవరేట్ స్టార్ గా మారిపోయారు. నాని కి ఉన్న ధైర్యం కూడా మిగతా స్టార్స్ కి లేదని ఎద్దేవా చేస్తున్నారు.