Sleep Health: కొన్ని ఆరోగ్య సమస్యలు చిన్న సమస్యలే అనిపించినా దీర్ఘకాలంలో ఆ ఆరోగ్య సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మారుతున్న కాలం వల్ల చాలామంది తమ జీవన శైలిని పూర్తిగా మార్చుకోవడంతో పాటు ఆహారపు అలవాట్లను సైతం మార్చుకున్నారు. సరైన సమయానికి తిండి తినకపోవడం, నిద్ర లేకపోవడం వల్ల నిత్యం చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.

కంప్యూటర్ స్క్రీన్స్ ముందు, స్మార్ట్ ఫోన్స్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల కొంతమందిని కంటి సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది నిద్రపోయిన సమయంలో విపరీతంగా చెమటలు పట్టడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఈ సమస్యను సీరియస్ గా తీసుకుంటే మరి కొందరు మాత్రం ఈ సమస్యను తేలికగా తీసుకుంటూ ఉండటం గమనార్హం.
Also Read: ఇన్నాళ్లకు రాణా గుర్తొచ్చాడా.. భీమ్లా నాయక్ రిలీజ్ పోస్టర్లతో అంచనాలు పెంచేసిన మేకర్స్..!
ఎవరైతే టీబీ సమస్యతో బాధ పడుతూ ఉంటారో వాళ్లను నిద్రలో చెమటలు సమస్యతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గ్యాస్ట్రోఇంటెస్టివల్ డిజార్డర్ వల్ల కూడా కొంతమందికి నిద్రలో చెమటలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. క్యాన్సర్ వచ్చిన వాళ్లను కూడా ఈ ఆరోగ్య సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఆహార గొట్టంలో తయారైన యాసిడ్ కడుపులో పేరుకుపోయినా కూడా ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. టీబీ, గ్యాస్ పరీక్షలు చేయించుకుని మందులు వాడటం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది.
Also Read: 15ఏండ్లకే ప్రేమలో పడ్డ అనసూయ.. భర్తను మొదటిసారి అక్కడే చూసిందంట..!