https://oktelugu.com/

Kitchen Tips: పిండికి పురుగులు పడుతున్నాయా.. ఈ చిట్కాలు పాటించండి

గోధుమ పిండికి ఎలాంటి పురుగులు పట్టకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2024 / 03:09 AM IST

    Flour Atta

    Follow us on

    Kitchen Tips: చపాతీ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది రోజులో ఏదో ఒక పూట తింటారు. బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌లో చపాతీలను తింటారు. వీటిని చేయడానికి తప్పకుండా గోధుమ పిండి ఉండాలి. ఇది లేనిదే అసలు చపాతీ కూడా కాదు. పూర్వం రోజుల్లో అయితే గోధుమలను ఎండలో వేసి వాటిని పిండి చేసి చపాతీలు చేసుకునే వారు. కానీ ఇప్పటి రోజుల్లో అయితే అన్ని కూడా మార్కెట్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. చపాతీల కోసం పిండిని డైరెక్ట్‌గా కొనుగోలు చేస్తున్నారు. కొని తెచ్చి వారం కాకముందే.. ఆ పిండికి పురుగులు పడుతుంటాయి. పోని గోధుమలు తెచ్చి చేద్దామంటే అంత సమయం ఉండదు. అదే మార్కెట్‌లో కొనుగోలు చేసిన గోధుమ పిండి తింటే.. అనారోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి గోధుమ పిండికి ఎలాంటి పురుగులు పట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. మరి గోధుమ పిండికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    కొందరు బిజీ వర్క్ వల్ల తొందరగా పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో పిండి గాలి పట్టి లోపలికి పురుగులు వెళ్తుంటాయి. కాబట్టి గోధుమ పిండిని టైట్‌గా ఉండే కంటైనర్లలో మాత్రమే స్టోర్ చేయాలి. అంటే డబ్బా లోపలికి అసలు గాలి పూర్తిగా వెళ్లకూడదు. ఎక్కువ రోజులు పిండి స్టాక్ ఉంచుతున్నట్లయితే అప్పుడప్పుడు పిండిని ఎండలో పెట్టాలి. గోధుమ పిండిలో బిర్యానీ ఆకులు, లవంగాలు వంటివి వేయాలి. వీటిని వేయడం వల్ల ఆ వాసనకు పురుగులు దరిదాపుల్లోకి కూడా రావు. ఎన్ని రోజులు పిండి నిల్వ ఉన్నా కూడా తాజాగా ఉంటుంది. కొందరు కొని తెచ్చినప్పుడు ఏ ప్యాకెట్‌లో అయితే గోధుమ పిండిని తీసుకొస్తారో.. అదే ప్యాకెట్‌లో ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల తొందరగా పురుగులు పట్టేస్తాయి. అదే కొని తెచ్చిన వెంటనే టైట్ గాజు కంటైనర్‌లో గోధుమ పిండి నిల్వ ఉంచుకుంటే పురుగులు పట్టకుండా ఉంటాయి.

    గోధుమ పిండిని డబ్బాల్లో నిల్వ ఉంచేటప్పుడు తేమ తగలకుండా చూసుకోండి. అంటే తడి స్పూన్ లేదా తడి చేతులు పెట్టవద్దు. వీటివల్ల పిండి తొందరగా బూజు పడుతుంది. చాలా మంది ఈ రోజుల్లో ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారు. కానీ గాజు డబ్బాల్లో గోధుమ పిండి నిల్వ ఉంచడం వల్ల ఎలాంటి పురుగులు పట్టవని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొంచెం ఉన్న గోధుమ పిండి డబ్బాలో మళ్లీ కొత్త గోధుమ పిండి వేయకూడదు. దీనివల్ల కొత్త గోధుమ పిండి ఈజీగా పాడవుతుంది. ఎప్పటికప్పుడు డబ్బాను క్లిన్ చేస్తే ఫ్రెష్‌గా కొత్త కంటైనర్లలో వేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే గోధుమ పిండికి పురుగులు పట్టవు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోగలరు.