Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. శ్రీవల్లి, కొటేష్ లు చనిపోవడంతో ఆ బాబును.. పిల్లలు తమ్ముడుగా మనం పెంచుకుందాం నాన్న అని అంటారు. దానికి కార్తీక్ పిల్లల ఆలోచనలు మెచ్చుకుంటాడు. కానీ ఈ ఊరు వదిలి వెళ్లాలని పిల్లలు అనడంతో.. పిల్లల నిర్ణయాన్ని దీప కూడా ఏ నిర్ణయం తీసుకుంటారని కార్తీక్ ను అడుగుతుంది. దీంతో కార్తీక్ రుద్రాణి అప్పు గురించి మనసులో ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక దీప కార్తీక్ బాధను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సౌందర్య.. పిల్లలు ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. అనుకుంటూ ఆనందరావుకి చెప్పుకుంటూ బాధపడుతుంది. ఇక ఆనందరావు దీప ఉంది అని తను చూసుకుంటుందని ధైర్యం చెబుతాడు. ఇక బస్తీలో ఓ భార్య భర్తలు మోనితకు సపోర్టుగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు కార్తీక్ నేను ఖాళీగా ఉంటున్నాను. ఏ విధంగా సహాయపడలేక పోతున్నానని దీపకు చెప్పుకుంటూ బాధపడతాడు.
కార్లో తిప్పాల్సిన చిన్నపిల్లలని, కాళ్లకు చెప్పులు లేని పరిస్థితి తీసుకు వచ్చాను అంటూ ఎమోషనల్ అవుతాడు కార్తీక్. మీరు ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి అని దీప ధైర్యం చెబుతుంది. మరోవైపు సౌందర్య కార్తీక్, మోనిత ల పెళ్లి ఫోటో చూసి కోపంతో బయట విసిరేస్తుంది. ఈ లోపు అక్కడికి మౌనిత వచ్చి ఆ ఫోటో ను కింద పడకుండా పట్టుకుని ఇది కొత్త సంవత్సరం గిఫ్ట్ గా భావిస్తున్నాను అని వెటకారంగా సమాధానం చెప్పి ఫోటోను తీసుకు వెళ్ళిపోతుంది.
ఇక కార్తీక్ బాబును ఎత్తుకొని బాధపడతాడు. ఇప్పటినుంచి ఆ బాబును కొడుకుగా చూసుకుంటానని కోటేష్, శ్రీవల్లి ఫోటోల ముందు మాట ఇస్తాడు. మరోవైపు రుద్రాణి కొత్త పన్నాగం తో దీప పిండివంటల వ్యాపారాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసి కార్తీక్ దగ్గరికి వెళుతుంది రుద్రాణి. ఇప్పటికే కోపంతో రగిలి పోతున్న కార్తీక్ రుద్రాణి కి ఎటువంటి సమాధానం ఇస్తాడో చూడాలి.