Kartari Yoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని కొత్తగా ప్రారంభించే పనులు శుభకార్యాలలోని నిర్వహించాలని చాలామంది అనుకుంటారు. దీంతో తాము ఏ పని అయితే మొదలు పెడుతున్నారు దాని గురించి తెలుసుకునేందుకు పండితులను సంప్రదిస్తారు. అయితే ఇటీవల కాలంలో చాలామందికి జ్యోతిష్యంపై అవగాహన పెరుగుతుంది. కొన్ని విషయాలపై అవగాహన పెంచాలని ఉద్దేశంతో కొందరు పండితులు ఆన్లైన్లో కొన్ని విషయాలను అందుబాటులో వస్తున్నారు. వీటిలో కర్తరి గురించి కూడా చెప్పారు. ప్రతి ఏడాది కర్తరి కాలం అని ఉంటుంది. ఈ కాలంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. కానీ మరికొన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read : మే నెలలో మూడు గ్రహాల సంచారం… ఈ నాలుగు రాశుల వారికి ధన లాభం..
కొత్త పంచాంగం ప్రకారం ఏప్రిల్ తో పాటు మే, జూన్ నెలల్లో శుభ ముహూర్తాలు ఉన్నట్టు చెప్పారు. వీటిలో మే నెలలో అత్యధికంగా మంచి రోజులు ఉన్నాయని తెలిసింది. దీంతో చాలామంది శుభకార్యాలు నిర్వహించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిర్ణయించుకున్న పెళ్లిళ్లను ఆయా తేదీల్లో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మరికొందరు ఇల్లు కట్టుకోవడానికి భూమి పూజ చేయడం, అన్న ప్రార్థన చేయడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వంటివి చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే మే 4 నుంచి కర్తరి కాలం ప్రారంభం అవుతుంది. కర్తరి కాలంలో కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మరణి నక్షత్రం లోని మూడవ పాదం లోకి ప్రవేశిస్తాడు. అలాగే వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం దాటే వరకు ఉన్న కాలాన్ని కర్తరి కాలం అంటారు. ఈ కర్తరికాలాన్ని రెండు రకాలుగా విభజించారు. ఇందులో ఒకటి డొల్లు కర్తరి, మరొకటి నిజ కర్తరి. డొల్లు కర్తరినీ సూర్యుడు భరణి నక్షత్రం మూడో పాదం లోకి ప్రవేశించిన రోజును పిలుస్తారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించిన తర్వాత నిజ కర్తరి ప్రారంభమవుతుంది. అయితే మే 4 నుంచి 28 వరకు కర్తరి కాలం ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది.
కర్తరి కాలంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం మంచి రోజులు ఉన్న ఈ పనులను మాత్రం చేయకూడదని అంటున్నారు. కర్తరి కాలంలో భూమికి సంబంధించిన ఎటువంటి పనులను ప్రారంభించే రాదని అంటున్నారు. అంటే భూమిలో చెట్లను నాటడం, బావులను తవ్వడం, భూమికి శంకుస్థాపన చేయడం, ఇల్లు లేదా కార్యాలయం నిర్మించాలని అనుకునేవారు శంకుస్థాపన కూడా చేయవద్దని పండితులు చెబుతున్నారు. అలాగే కొత్త వాహనాలను కూడా ఈ సమయంలో కొనుగోలు చేయకూడదని.. వాటిని వెంటనే పూజ చేసి డ్రైవ్ చేయకూడదని అంటున్నారు.
అయితే కర్తరి కాలంలో కొన్ని పనులు చేసుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో బారసాల, అన్నప్రాసన వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని అంటున్నారు. కర్తరి కాలంలో ఏవైనా పొరపాట్లు చేస్తే సూర్యుడు అనుగ్రహం పొందాలి. ఆ స్వామి అనుగ్రహం కోసం సూర్యుడి ద్వాదశ నామాలు చదువుతూ ఉండాలి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.