Zodiac Signs : మే నెల రాగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఈ నెలలో ఎండలు బాగా ముదిరిపోవడంతో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నెల కొందరికి అదృష్టం పరీక్షలు ఉంది. కొన్ని గ్రహాలు రాశుల్లో ప్రవేశించడం వల్ల మిగతా రాశులపై ప్రభావం పడి కొందరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ఈ నెలలో కీలకమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. మే 7వ తేదీన బుధుడు మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత 14వ తేదీ నుంచి మిధున రాశిలో బృహస్పతి సంచారం చేయనుంది. ఈ నెలాఖరిలో శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా మూడు గ్రహాలు ఒకే నెలలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో ఆయా రాశుల వారికి అదృష్టం వరించనుంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read : సూర్య భగవానుడి ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయండి..
మూడు గ్రహాల సంచారం వల్ల మే నెలలో తులారాశి వారికి లక్ష్మీ కటాక్షం వరించనుంది. ఈ రాశి వ్యాపారులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు శని దేవుడి ఆశీస్సులు ఉంటాయి. వీరు ఈ నెల మొత్తం ఉత్సాహంగా ఉంటారు. కొత్త పనులు ఏది ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేయగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అనుకోకుండా ధన లాభం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు గతంలో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ధనస్సు రాశి వారికి మే నెల కలిసి రానుంది. ఈ రాశి వారికి ఈనెల శుభవార్తలో అందుతాయి. సూర్యుడు శుభ స్థానంలో ఉండడమే వీరికి అనుకూలమైన వాతావరణ ఉంటుంది. అలాగే ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులు అంతా కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాల సంచారం వల్ల కలిసి వస్తుంది. వీరికి ఇప్పటివరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసేవారు లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు కొత్తగా చేపట్టే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు ఓటి పక్షులు పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గం ఏర్పరచుకుంటారు.
వృషభ రాశి వారికి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించుకుంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడితే పెద్దల సలహా అందుతుంది. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీరు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అయితే శనిదేవుడి అనుగ్రహం కోసం వీరు ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మరింతగా లాభం పొందే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వీటివల్ల లాభాలు ఉంటాయి.