https://oktelugu.com/

Junk Food: ఆల్కహాల్ కంటే జంక్ ఫుడ్ ప్రమాదకరం.. పిల్లలకు షాకింగ్ న్యూస్?

Junk Food: చిన్న పిల్లలలో ఎక్కువమంది జంక్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తారు. తక్కువ ఖర్చుతో రుచిగా ఉండే జంక్ ఫుడ్ వల్ల చిన్నారులను అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆల్కహాల్ తో శరీరానికి జరిగే నష్టం కంటే జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టం ఎక్కువని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ చెబుతోంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పాఠశాలలకు, విద్యార్థుల హాస్టళ్లకు 50 మీటర్ల వరకు చిరుతిళ్ల దుకాణాలపై నిషేధం విధించటం గమనార్హం. తల్లిదండ్రులు పిల్లలు తినే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 13, 2021 11:06 am
    Follow us on

    Junk Food: చిన్న పిల్లలలో ఎక్కువమంది జంక్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తారు. తక్కువ ఖర్చుతో రుచిగా ఉండే జంక్ ఫుడ్ వల్ల చిన్నారులను అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆల్కహాల్ తో శరీరానికి జరిగే నష్టం కంటే జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టం ఎక్కువని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ చెబుతోంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పాఠశాలలకు, విద్యార్థుల హాస్టళ్లకు 50 మీటర్ల వరకు చిరుతిళ్ల దుకాణాలపై నిషేధం విధించటం గమనార్హం.

    Junk Food

    Junk Food

    తల్లిదండ్రులు పిల్లలు తినే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు స్నాక్స్ కు బదులుగా ఫ్రూట్‌సలాడ్‌లు, పల్లీలు, బెల్లంతో చిక్కీలు, లడ్డూలు, రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన వంటకాలను ఇవ్వాలి. మన దేశంలో కేరళ రాష్ట్రం ఈ నిబంధనలను సరిగ్గా అమలు చేస్తోంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్గదర్శకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ పదో స్థానంలో ఉండగా ఏపీ 19వ స్థానంలో ఉంది.

    Also Read: Food For Childrens: పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టకండి..?

    2016 సంవత్సరంలో ప్యాకింగ్ ఫుడ్ లో ప్రమాదకర రసాయనాల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిషేధించినా కొంతమంది జంక్ ఫుడ్ తయారీదరులు వాటిని వాడుతున్నారు. రుచి, ఫ్లేవర్‌, కలర్స్‌, అధిక తీపి కొరకు ప్రమాదకరమైన కెమికల్స్ ను జంక్ ఫుడ్ తయారీదారులు వినియోగిస్తున్నారు. జంక్ ఫుడ్ శరీరంలోని 18 అవయవాల పనీతీరుపై ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. జంక్ ఫుడ్ వల్ల రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

    పిల్లలు పౌష్టికాహారం తింటే మాత్రమే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే మహిళలను రక్తహీనత సమస్య వేధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    Also Read: Children’s food: పిల్లలకు ఈ ఆహారం తినిపిస్తే ప్రమాదం అట.. జాగ్రత్త