https://oktelugu.com/

IT Return: జూలై 31 డెడ్ లైన్.. గడువులోగా చెల్లించకుంటే జైలు శిక్షే!

భారత ఐటీ చట్టంలోని 1961 సెక్షన్ 243 ఎఫ్ ప్రకరాం ప్రతి ఒక్కరు ఆదాయపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రూ.5 లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉన్నవారు తప్పనిసరిగా ఐటీ ధాఖలు చేయాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : July 26, 2023 4:01 pm
    IT Return

    IT Return

    Follow us on

    IT Return: దేశ అభివృద్ధి సాధించడానికి ప్రతి పౌరుడు తనకు వచ్చే ఆదాయంలో కొంత ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే. ఇది వారి ఆదాయాల స్థాయిని భట్టి ఉంటుంది. మన దేశంలో రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొందరు నిబంధనలకు అనుగుంగా ఐటీ ఫైల్స్ చేస్తుంటారు. కానీ మరికొందరు వీటిని పట్టించుకోరు. ప్రభుత్వానికి తాము చెల్లించాల్సిన ఆదాయాన్ని ఎగవేత చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఎప్పటికైనా దీని నుంచి తప్పించుకోలేరు. ప్రభుత్వం విధించిన ఓ గడువు ప్రకారం చెల్లించాలి. లేదంటే భారీ జరిమానా పడడంతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని కొందరు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    భారత ఐటీ చట్టంలోని 1961 సెక్షన్ 243 ఎఫ్ ప్రకరాం ప్రతి ఒక్కరు ఆదాయపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రూ.5 లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉన్నవారు తప్పనిసరిగా ఐటీ ధాఖలు చేయాలి. ఈ ఏడాది జూలై 31 లోగా ఐటీ దాఖలుకు చివరి తేదీని నిర్ణయించారు. కొందరు గడువు పెంచుతారని అంటున్నారు. మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. కానీ గడవు పెంచినా.. పెంచకపోయినా.. ఎప్పటికైనా చెల్లించాల్సింది మాత్రం తప్పదు. ఒకవేళ గడువు పూర్తయితే ఎలాంటి జరిమానా పడుతుందంటే?

    ఆదాయపు పన్ను దాఖలు గడువు తీరిన వారికి చెల్లించాలనుకుంటే ప్రతీ ఫైల్ పై 1 శాతం వడ్డీని వసూలు చేస్తారు. రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రూ.5వేలు చార్జి చేస్తారు. ఆలోపు ఉన్న వారికి రూ.1000 వసూలు చేస్తారు. అయితే సెక్షన్ 139 (8ఏ) ప్రకారం ఫైల్ ను అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ యాక్ట్ 2022 అసెస్సీ ఆదాయ రిటర్న్ ను ఫైల్ చేయడానికి ఎక్కువ గడువు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ సంబంధిత సంవత్సరానికి 24 నెలలలో పు కచ్చితంగా అప్డేట్ చేయాలి. అప్పటికీ ఆలస్యమైతే భారీ జరిమానా తప్పదు.

    ఉదాహరణకు జూలై 31 తరువాత ఫైల్ దాఖలు చేస్తే 1 శాతం వడ్డీని విధిస్తారు. ఈ గడువు తరువాత 24 నెలలోపు జరిమానాతోనూ చెల్లించని వారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ శిక్ష 6 నుంచి 7 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా వారు తమ ఆస్తులను సంవత్సరంలోని నష్టాలను చూపించలేరు. ఇక ఆస్తి పన్నులో కనిష్టంగా 50 శాతం.. గరిష్టంగా 200 శాతం ఫెనాల్టీ పడుతుంది. అందువల్ల ఆదాయపన్ను చెల్లించాల్సిన వారు గడువులోగా చెల్లంచడం చాలా మంచిదని ఐటీ ఆధికారులు సూచిస్తున్నారు.