Homeఎడ్యుకేషన్Jobs: తిరుప‌తి ఐస‌ర్‌లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

Jobs: తిరుప‌తి ఐస‌ర్‌లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

Jobs: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌ నిరుద్యోగులకు తాజాగా మరో శుభవార్తను అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ‌శాఖ‌కు సంబంధించిన ఈ సంస్థ కాంట్రాక్ట్ విధానం ద్వారా రెండు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో/ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

సంబంధిత సబ్జెక్టులలో కనీసం 55 శాతం మార్కులు సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఎమ్మెస్సీ/తత్స‌మాన ఉత్తీర్ణత పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈమెయిల్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

gopi@labs.iisertirupati.ac.in ఈమెయిల్ ఐడీకి సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 31,000 రూపాయలతో పాటు హెచ్ఆర్ఏ లభిస్తుంది. భారీ వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 2 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా http://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

1 COMMENT

  1. […] Samantha: బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టేసింది. వరుస సినిమాల అప్ డేట్స్ ఇస్తోంది. పాన్ ఇండియా ఫిల్మ్స్ తో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కు కూడా ఓకే చెప్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. సమంతకు మరోసారి క్రేజీ ఆఫర్ వచ్చేసిందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular