Jio Financial Services: మొదటి రోజే తుస్సుమన్న రిలయన్స్ ఇండస్ట్రీ ఫైనాన్సియల్ స్టార్ షేర్లు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్లకు జియో ఫైనాన్షియల్ సర్విసెస్ లిమిటెడ్ షేర్లను అర్హత గల వారికి 1:1 నిష్ఫత్తిలో కేటాయించారు. ఇవి 10 రోజుల పాటు కొనసాగుతాయి.

Written By: Chai Muchhata, Updated On : August 21, 2023 4:33 pm

Jio Financial Services

Follow us on

Jio Financial Services: దేశీయ మార్కెట్లలో నంబర్ వన్ స్థానం కోసం నిత్యం పోటీ పడుతున్న జియో తాజాగా ఫైనాన్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ముఖేష్ అంబానీ ఇప్పటికే ప్రకటించగా ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు మార్కెట్లోకి జియో ఫైనాన్సియల్ స్టార్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే స్టార్ ధర రూ.261.85 గా ట్రేడింగ్ నిర్వహించగా.. మార్కెట్లోకి అడుగుపెట్టిన తరువాత క్షీణతతోనే కొనసాగింది. ఉదయం 10.10 గంటలకు స్టాక్ 4.95 శాతం నష్టపోయింది. ఆ తరువాత ఎస్ఎస్ఈలో రూ.248.90 వద్ద ట్రేడింగ్ కొనసాగింది. అయతే జియో ఫ్రీ మార్కెట్ బ్లాక్ లో కొనసాగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్లకు జియో ఫైనాన్షియల్ సర్విసెస్ లిమిటెడ్ షేర్లను అర్హత గల వారికి 1:1 నిష్ఫత్తిలో కేటాయించారు. ఇవి 10 రోజుల పాటు కొనసాగుతాయి. వీటిని జేఎస్ఎఫ్ ఎల్ షేర్లు, ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్లలో ఉంచారు. అంటే ఈ షేర్లను డెలివరీ ప్రాతిపదికన మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలవుతాయి. ఈ పది రోజుల్లో కంపెనీ షేర్లలో ఇంట్రా డే ట్రేడ్ ఉండదు. ఎన్ఎస్ ఈ లో షేరు ధ రూ.248.90 గా కొనసాగుతుండగా మార్కెట్ క్యాప్ రూ.1,58,133 కోట్లుగా ఉంది.

ఇదిలా ఉండగా ఫ్రీ మార్కెట్ లో బ్లాక్ ట్రేడ్ లో 1.4 కోట్ల షేర్లు చేతులు మారినట్లు సమాచారం. స్టాక్ లో తరువాతి 10 ట్రెడింగ్ సెషన్ కు ఐదు శాతం సర్క్యూట్ ఫిల్టర్ ఉంటుంది. 10.20 గంటల సమయంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్ ను ఎస్ఎస్ ఈని తాకింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు నిరాశకు లోనయ్యారు. కంపెపీ దేశీయ ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగంలో కీలకంగా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.