Jasmine flowers : ఇంటికి అందం ఇల్లాలు అని అంటారు. ఇంట్లో ఆడవాళ్లు ఉంటే ఆ సందడి వేరే ఉంటుంది. అందుకే చాలామంది తమకు కూతురు కావాలని ప్రత్యేకంగా కోరుకుంటారు. అయితే కొందరు తమకు కొడుకులు ఉండేవారు ఇంట్లోకి వచ్చిన కోడళ్లను కూతుర్లా లా గా చూసుకుంటారు. పెళ్లి చేసుకున్న వారు తమ సతీమణిని ఎంతో ప్రేమగా చూసుకునే వారు ఉన్నారు. ఎందుకంటే తమ జీవితంలోకి వచ్చిన ఆడవారిని లక్ష్మీదేవిలా భావిస్తారు. వారిని గౌరవిస్తూ వారికి సపర మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో వారికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే కొందరు మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత ఆడవారిని పట్టించుకోరు. ఇలాంటి సమయంలో కొందరు ఆడవాళ్లు ‘మూరెడు మల్లెపూలు కూడా తేరు’ అని మగవారిని నిందిస్తూ ఉంటారు. అయితే భార్యకు మూరెడు మల్లెపూలు కొనిస్తే ఎన్ని లాభాలు తెలుసా?
అందాల అలంకరణలో ఆడవారు తలలో పూలు ధరిస్తూ ఉంటారు. పూలు ధరించడం వల్ల ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు ఆడవారు పూలను ధరించడం వల్ల వారి నుంచి సువాసన వెదజల్లుతుంది. వీటిలో మల్లెపూలు ధరిస్తే మరింత అందంగా కనిపించడంతోపాటు మధురమైన సువాసన వస్తుంది. అందుకే ఆడవారు మల్లెపూలను ధరించడం చాలా ఇష్టపడతారు. అయితే ఆ మల్లెపూలు భర్త ఇవ్వడం వల్ల ఎంతో సంతోషిస్తారు. కానీ కొంతమంది భర్తలు మల్లెపూలు తేవడానికి ఇష్టపడరు. కానీ మల్లెపూలు కొనివ్వడం వల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది.
Also Read : భార్యకు మల్లెపూలు తెస్తే జరిగేది అదే.. ప్రతీ భర్త తప్పక తెలుసుకోండి..!
శుక్రుడు సంపదకు అధిపతి అని అంటారు. శుక్ర గ్రహం అనుగ్రహం ఉండడంవల్ల ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కావడానికి శుక్రుడి అనుగ్రహం ఉండాలని అంటున్నారు. అయితే శుక్రుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. మల్లెపూలు మహిళలు ధరించడం వల్ల ఇంట్లోని వ్యక్తులకు సంపద పెరుగుతుందని అంటారు. అయితే పురుషులు తమ సతీమణులకు మల్లెపూలు కొనివ్వడం వల్ల ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని, అందులోనూ వ్యాపారులు అధిక లాభాలు పొందుతారని అంటారు.
అందువల్ల ఇంట్లోని ఆడవారికి మల్లెపూలు కొనివ్వాలని కొందరు చెబుతూ ఉంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మల్లెపూల వల్ల మహిళలు ఎంతో సంతోషంగా ఉంటారని, దీంతో ఇల్లు కూడా సంతోషంగా ఉంటుందని అంటున్నారు. సాక్షాత్తూ మహా లక్ష్మిగా భావించే ఆడవారు సంతోషంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటున్నారు. అందువల్ల మల్లెపూలు కొనివ్వాలని అంటున్నారు.