IT notices credit card users: ప్రస్తుత రోజుల్లో చాలామంది వద్ద క్రెడిట్ కార్డు ఒకటికి మించి ఉన్నాయి. అత్యవసర సమయంలో.. షాపింగ్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డులను తప్పనిసరిగా వాడుతున్నారు. అయితే కొందరు చిన్నచిన్న అవసరాలకు కూడా రూపే కార్లను ఉపయోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డులపై ఎంత ఎక్కువగా ట్రాన్సాక్షన్ ఉంటే అంత రివార్డ్ పాయింట్స్ వస్తాయని చాలామంది భావన. దీంతో స్నేహితులకు డబ్బు అవసరం అయితే ఇవ్వడం.. రెంటు పే చేయడం.. ఇతర ఖర్చులు క్రెడిట్ కార్డు ద్వారా పెడుతూ ఉంటారు. కానీ పరిమితికి మించి క్రెడిట్ కార్డు పై ఖర్చులు చేస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు కూడా పంపే అవకాశం ఉందని చాలామందికి తెలియదు. అసలు ఎంత పరిమితి మించితే ఐటీ శాఖ నిఘా ఉంచే అవకాశం ఉంటుంది..?
ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే వారి క్రెడిట్ కార్డు పై ఉన్న లిమిట్లో 30% వరకు వాడితేనే ఎలాంటి నష్టం ఉండదు. అయితే ఒక్కోసారి లేదా అత్యవసర సమయంలో 50% వరకు వాడుకోవచ్చు. కానీ కొందరు 80% వరకు వాడుతున్నారు. కొందరి బ్యాంకు ట్రాన్సాక్షన్ పెరిగిపోతుండడంతో బ్యాంకులు వారి లిమిట్స్ పెంచుతున్నాయి. దీంతో వినియోగదారులు తమ వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉందన్న భరోసాతో లగ్జరీ వస్తువులు, ఆన్లైన్ కొనుగోలు, హోటల్స్ బుకింగ్ వంటివి చేస్తున్నారు.
అయితే ఏడాదిలోగా 10 లక్షలకు మించి క్రెడిట్ కార్డు పై ఖర్చు చేస్తే Income Tax (IT) అధికారులు క్రెడిట్ కార్డు హోల్డర్స్కు నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. అయితే పది లక్షలకు మించి ఖర్చు చేసిన వివరాలు ఉంటే పర్వాలేదు. కానీ ఎలాంటి వివరాలు లేకపోతే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆదాయానికి మించి ఖర్చు చేసినా కూడా అదనపు పన్ను విధించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తే ఆ వివరాలు బ్యాంకు ద్వారా annual information return (AIR) కు వెళ్తాయి. ఆ తర్వాత ఖాతాదారులకు నోటీసు పంపే అవకాశం ఉంటుంది.
ఆదాయాన్ని తక్కువ చూపి ఖర్చులు ఎక్కువ చేసే వారికి, బ్లాక్ మనీ లేదా ఆన్ అకౌంటెడ్ ఇన్కమ్ ఉంటే, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడానికి సరైన ఆదాయ వనరులు చూపకపోవడం, వ్యక్తిగత ఖర్చుల మధ్య స్పష్టత లేకపోయినా ఆదాయక పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపితే సంబంధిత ఆదాయ వివరాలను సిద్ధం చేసుకోవాలి. బ్యాంకు స్టేట్మెంట్లను, క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రతి ఖర్చుకు సంబంధించిన వివరాలను చూపించాలి. అవసరమైతే చార్టెడ్ అకౌంట్ సలహా తీసుకోవాలి. సరైన డాక్యుమెంట్లు చూపిస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.