Mobile Effect : లేచిన వెంటనే మొబైల్ చూస్తున్నారా అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే

దని డైలీ ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడటం ప్రారంభించారో ఇంకా అంతే సంగతులు. ఆరోగ్యం ఇరకాటంలో పడుతుంది. కాబట్టి మొబైల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.

Written By: Kusuma Aggunna, Updated On : October 9, 2024 9:49 pm

Mobile Said Effect

Follow us on

Mobile Effect : ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ముఖ్యమైన వ్యక్తిగా అయిపోయింది. మొబైల్ లేకుండా కనీసం ఒక్క క్షణం కూడా ఉండలేరు. 24 గంటలు కూడా మొబైల్‌తోనే గడుపుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతి నిమిషం కూడా మొబైల్‌తోనే గడుపుతున్నారు. భోజనం చేసినప్పుడు, చదివినప్పుడు, వంట చేసినప్పుడు ఆఖరుకి బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు కూడా మొబైల్‌ను వదలడం లేదు. అయితే ఉదయం లేచిన వెంటనే మనం చేసే పనులు, అలవాట్ల వల్ల రోజంతా ఆరోగ్యంగా, హాయిగా ఉంటాం. అదే లేచిన వెంటనే మొబైల్ చూస్తూ కూర్చుంటే ఇంకా అంతే సంగతులు. ఉదయాన్నే లేచిన తర్వాత వ్యాయామం వంటివి చేయకుండా మొబైల్‌లో లీనమైపోతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు. మరి ఆ సమస్యలేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

చాలామంది ఉదయం లేచిన వెంటనే మొదట మొబైల్ చూస్తారు. రాత్రి ఎవరూ మెసేజ్‌ చేశారు? ఏవైనా నోటిఫికేషన్స్ వచ్చాయా? లేదా? అని చూసి అలా ఒక పదిహేను నిమిషాల పాటు చూస్తారు. లేచిన వెంటనే మొబైల్ చూడటం వల్ల కంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నుంచి వచ్చే బ్లూ రేస్ కళ్లను దెబ్బతీస్తాయి. అలాగే కంటి రెటీనా కూడా దెబ్బతింటుంది. వీటితో పాటు కళ్లు బాగా ఒత్తిడికి గురవడంతో పాటు మాక్యులర్ డిజెనరేషన్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది. పొద్దున్నే మొబైల్ చూడటం వల్ల వాటి నుంచి వచ్చే కిరణాల వల్ల శరీరంలో మెలటోనిన్ స్థాయి పెరుగుతుంది. దీంతో రోజంతా బద్దకంగా, నిద్రమత్తుగా అనిపిస్తుంది. ఏ పని మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ మీద చేయలేరు. రోజంతా చిరాకుగా అనిపిస్తుంది.

లేచిన వెంటనే ఫోన్ చెక్ చేయడం ఒక అలవాటుగా మారితే ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే అలవాటు అయితే మానసిక సమస్యలు తప్పవని అంటున్నారు. కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే మొబైల్ చూడటం కంటే యోగా, మెడిటేషన్, వ్యాయామం, సూర్యకాంతిలో కూర్చోవడం, పాటలు వినడం, పేపర్ చదవడం, పుస్తకాలు చదవడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఎనర్జీటిక్‌గా ఉంటారు. కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా కూడా సంతోషంగా ఉంటారు. ఏదైనా పనిచేసేటప్పుడు కళ్లను ఎక్కువసార్లు తెరిచి ముయాలి. ఇలాంటి పనులు ఉదయం పూట చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉంటారు. లేదని డైలీ ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడటం ప్రారంభించారో ఇంకా అంతే సంగతులు. ఆరోగ్యం ఇరకాటంలో పడుతుంది. కాబట్టి మొబైల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.