Distance between husband and wife: భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. ఒకరికి తెలియకుండా మరొకరు పెళ్లి అనే కార్యక్రమంతో ఇద్దరు ఒక్కటిగా మారతారు. మీరు కలకాలం సంతోషంగా జీవించాలని పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు కోరుకుంటారు. కానీ నేటి కాలంలో పెళ్లి చేసుకున్న జంట కొన్నాళ్లు మాత్రమే కలిసి ఉంటుంది. ఆ తర్వాత రకరకాల కారణాలు చెప్పి దూరమవుతూ ఉంటుంది. అయితే కొన్ని జంటలు వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇక కలిసి ఉండడం ఇష్టం లేదని విడాకులు తీసుకొని దూరమైపోతున్నారు. కానీ మరికొన్ని జంటలు మాత్రం ఇంట్లోనే ఉంటారు. ఒకరినొకరు చూసుకుంటారు. కానీ వీరి మధ్య ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు ఉండవు. అందుకు కారణం ఏమిటంటే?
ఓకే ఓకే అనే తమిళ డబ్బింగ్ సినిమాలో హీరో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటారు. కానీ ఒకరికి ఒకరు మాట్లాడుకోరు. వారి మధ్య ఉన్న హీరోతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటారు. వీరి మధ్య ఏదో చిన్న మనస్పర్ధం ఏర్పడడం వల్ల కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకోకుండా ఉంటారు. ఇది సినిమాలోని సన్నివేశమే అయినా నిజజీవితంలో చాలా ఇళ్లల్లో జరుగుతుంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేకున్నా కూడా ఒకరికొకరు ప్రేమ, ఆప్యాయతతో ఉండడం లేదు. దీంతో ఒక్కోసారి వీరు భార్యాభర్తలేనా? అన్న సందేహం కూడా కలుగుతుంది.
అయితే ఈ పరిస్థితి రావడానికి వారి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ లేకపోవడమే అని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పురుషులు ఏదో ఒక పనితో బిజీగా ఉంటున్నారు. సాయంత్రం భోజనం చేసి నిద్రపోతున్నారు. మళ్లీ ఉదయం లేచి యధావిధిగా తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. ఇదే సమయంలో మహిళలు సైతం వంటింట్లోని పనులు చేస్తూ అలసిపోతున్నారు. ఆ తర్వాత భర్త విషయంలో కూడా పట్టించుకోవడం లేదు. ఇక ఉద్యోగం చేసే మహిళలు అయితే వారి పనుల్లోనే నిమగ్నమై ఉంటున్నారు. ఇలా ఎవరికి వారు అన్నట్లు.. ఓకే ఇంట్లో ఉన్నా.. దూరంగా ఉంటున్నారు.
ఇలా దూరంగా ఉండటం వల్ల కొన్ని రోజుల తర్వాత వారి మధ్య అసలు ఎలాంటి బంధం ఉన్నది? అన్న ప్రశ్న కూడా తలెత్తే ప్రమాదం ఉంది.. అంతేకాకుండా ఒకరి గురించి ఒకరు పట్టించుకోకపోవడంతో రిలేషన్షిప్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండాలంటే రోజులో కొంత సమయం.. లేదా వారంలో ఒకరోజు భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఫిజికల్ అట్రాక్షన్తో వీరిమధ్య అన్యోన్యత పెరిగిపోతుంది. చాలామంది స్రీ లు ఈ విషయంలో పెద్ద ఆసక్తి చూపించరు. పురుషులు సైతం కొన్ని పనుల వల్ల బిజీగా ఉండి భార్యను పట్టించుకోరు. మీరు సరదాగా మాట్లాడుకోవడానికి పిల్లలు లేదా కొన్ని పరిస్థితులు అడ్డుగా ఏర్పడతాయి. ఉమ్మడి కుటుంబంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వీకెండ్ లేదా ప్రత్యేక సమయాల్లో కలిసి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. దీనికి ఫిజికల్ అట్రాక్షన్ తోడు అయితే బంధం మరింత బలపడే అవకాశం ఉందని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.