
Romance : శృంగారం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుందనే దానిపై అందరికి అనుమానాలు ఉంటాయి. కొందరేమో రాత్రి అయితేనే కరెక్ట్ అని మరికొందరేమో పగటి పూట కూడా బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. నిపుణులు మాత్రం పగటిపూట శృంగారమే మంచిదని చెబుతుంటారు. మన పూర్వీకులేమో మొదటి రాత్రి జరుపుకుంటారు కానీ మొదటి పగలు కాదని సెలవిస్తున్నారు. దీంతో వారు రాత్రి పూట శృంగారమే సహజమైనదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పగలు, రాత్రి ఏది మంచిదనే దానిపై ఇప్పటికి కూడా స్పష్టత రాలేదు. దీంతో శృంగారం ఎవరికి నచ్చిన సమయంలో వారు చేసుకుంటూ ముందుకు పోతున్నారు.
పిల్లలు అయ్యాక
భార్యాభర్తలు పిల్లలు పుట్టక ముందు రాత్రి సమయాల్లో శృంగారానికి సమయం ఉంటుంది. సంతానం కలిగాక వారి ముందు శృంగారం చేయడం ప్రమాదమే అని మానేస్తున్నారు. ఇలాంటి వారికి పిల్లలు లేని సమయంలో శృంగారం చేసుకోవడం మంచిదే. ఒకవేళ పిల్లలు ఉంటే వారు నిద్రపోయాక కానీ వారికి వీలు కాదు. వారు నిద్రపోయే సరికి వీరికి కూడా నిద్ర ముంచుకొస్తుంది. దీంతో వారు కూడా తల వాల్చాల్సిందే. దీంతో ఆలుమగల మధ్య శృంగారానికి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే మంచిదిగా భావించుకోవడం సహజమే.
వృత్తిలోనే..
ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది జంటలు ఇద్దరు పని చేస్తున్నారు. దీంతో వారికి సమయం చిక్కడం లేదు. ఎవరి కెరీర్ లో వారు ముందుకు వెళ్తూ దాంపత్య సుఖాన్ని పక్కన పెట్టేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన సంఘటనలుంటున్నాయి. ఈ క్రమంలో శృంగార కోరికలు తీర్చుకునే సమయం చిక్కడం లేదు. శృంగారానికి తెల్లవారు జామున కూడా మంచి సమయమే. దీని వల్ల మనకు ఎనర్జీ లెవల్స్ ఇంకా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
టెస్టోస్టిరాన్
రాత్రి కంటే ఉదయం పూటే శృంగారం వైపు ఆలోచనలు పెరిగేలా చేస్తుంది టెస్టోస్టిరాన్. ఉదయం సమయంలోనే ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల మనం తెల్లవారు జామునే శృంగారానికి ప్రాధాన్యం ఇస్తే మంచి ఫలితం వస్తుంది. బెడ్ రూంలో ఏకాంతంగా గడిపే సమయం దక్కితే ఎప్పుడైనా ఫర్వాలేదని ఇంకా కొందరు సూచిస్తున్నారు. ఉదయాన్నే ఎక్కువ మంది శృంగారానికి ప్రయత్నిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఏకాంతం సమయంలో శృంగారానికి అందరు చొరవ తీసుకుంటున్నారు.

శృంగారానికి..
రోజును ప్రారంభించడానికి ఉదయం పూట సరైంది. దీనికి మించిన సమయం లేదు. తెల్లవారుజామున శృంగారంలో పాల్గొనే అలవాటు ఉన్న వారికి అందులో మంచి ప్రావీణ్యం సంపాదిస్తారని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. శరీరంలో హార్మోనల్, కెమికల్ రియాక్షన్ తో శృంగారేచ్ఛ బాగా పెరుగుతుంది. మార్నింగ్ వాకింగ్ చేసే వారికి ఇది మరింత అవకాశం ఉంటుంది. ఏకాంత సమయం దొరికే అవకాశం ఉండే వారికి ఎంతో బాగుంటుంది.