https://oktelugu.com/

Wedding : ఇంతకీ పెళ్లి చేసుకోవాలా? వద్దా?

Wedding నేటి యువతారాన్ని మాట్లలో పెట్టి మనస్సు కదిలిస్తే మాకు పెళ్లి వద్దుబాబోయ్ అని కచ్చితంగా చెప్పేస్తున్నారు. ఎందుకు పెళ్లంటే ఇంత భయపడుతున్నారో తెలియదు కానీ.. పెళ్లి చేసుకోకపోవడం వలన మీకు, మీకుటుంబానికి, సమాజానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

Written By:
  • NARESH
  • , Updated On : July 11, 2024 / 09:50 PM IST

    Is it profitable to get married? loss

    Follow us on

    Wedding : వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటరా? అంటూ పాటలు ఉన్నాయి. కానీ కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అంటూ పాటలు ఉన్నాయి. అర్థం చేసుకోవడంలోనే ఏ రిలేషన్ అయినా ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తితో సంతోషంగా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తారు. లేదంటే వదిలించుకోవాలి అనుకుంటారు. ప్రస్తుతం ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఇదంత పక్కన పెడితే పెళ్లి అంటే ఒక గొప్ప బంధం. ఎక్కడో పుట్టి ఒక దగ్గర కలిసి ఒకరి కోసం ఒకరు బతుకుతారు. కానీ నేటి రోజుల్లో పెళ్లినే వద్దు అనుకుంటున్నారు చాలా మంది.

    నేటి యువతారాన్ని మాట్లలో పెట్టి మనస్సు కదిలిస్తే మాకు పెళ్లి వద్దుబాబోయ్ అని కచ్చితంగా చెప్పేస్తున్నారు. ఎందుకు పెళ్లంటే ఇంత భయపడుతున్నారో తెలియదు కానీ.. పెళ్లి చేసుకోకపోవడం వలన మీకు, మీకుటుంబానికి, సమాజానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. పెళ్లి వయస్సు వచ్చిందటే చాలు వారి మెదడుని, మనసును తొలిచే ప్రశ్న ఒకటే పెళ్లి చేసుకోవాలా, వద్దా? ఇంతకీ పెళ్లి చేసుకోవాలా వద్దా అని మనం కూడా ఓ సారి కాస్త తెలుసుకుందామా?

    పెళ్లి వద్దని ఎవరు చెప్పరు. ఎందుకంటే చివరి వరకు తోడు ఉండేంది భర్త లేదా భార్య మాత్రమే అనేది పచ్చి నిజం. సమాజంలో పెళ్ళికి చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లి చేసుకోకపోతే కుటుంబం, బంధువులు, సోదరులు, స్నేహితుల నుంచి విమర్శలు వస్తాయి. అంతేకాదు ఒంటరితనం, విచారం అనుభవించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఒక ట్విస్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు. కాస్త గుండె నిబ్బరం చేసుకోండి. పెళ్లి చేసుకున్న వారికంటే పెళ్లి చేసుకోని వారే చాలా ఆరోగ్యంగా, బ్యూటీపుల్ గా, ఫిట్టుగా ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారని అంటున్నారు నిపుణులు.

    మరో విషయం ఏంటంటే.. పెళ్లి వద్దు అనుకునే కొందరికి గొప్ప గోల్ ఉంటుందట. ఇలాంటి వారు తన వ్వక్తికత హోదాను , పరపతి, గౌరవాన్ని పెంచుకొని, వారు అనుకున్న గోల్ రీచ్ కావడానికి పక్క ప్రణాళిక వేసుకుంటారు. సమయం కేటాయించి వారు అనుకుంది సాధిస్తారు. ఆ తర్వాత కొందరు పెళ్లి గురించి ఆలోచిస్తే మరికొందరు అలాగే మిగిలిపోతారు. ఇలాంటి వారు పెరగడం వల్ల కూడా నష్టాలు ఉన్నాయట.

    వివాహం చేసుకునే వారు తగ్గడం వలన జనాభా సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగి సామాజిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అవివాహితులు పెరగడం వలన కుటుంబ విలువలు తగ్గి సంస్థగత నిర్మాణాలు దెబ్బతింటాయి. పెళ్లి రేట్లు తగ్గడం వలన నాగరికత లో మార్పులు తలెత్తుతాయి. ఎన్ని నష్టాలు ఉన్నా పెళ్లి వ్వక్తిగత ఇష్టం. పెళ్లి చేసుకోకుండా సంతోషంగా ఉన్నవారు కూడా ఉంటే పెళ్లి చేసుకొని భాగస్వామితో పిల్లలతో ఆనందంగా ఉన్నవారు కూడా ఉన్నారు.

    ఒంటరి వ్వక్తులు స్నేహితులుతో బంధువులతో గడుపుతూ బంధాన్ని బలంగా ఉంచుకుంటారు. అయితే ఒంటరితనం అధిగమించిన వారు కచ్చితంగా జీవితంలో అనుకున్నది సాధిoచాస్తారని అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా కాస్త ఆలోచించండి. అనుకుంటే పెళ్లి తర్వాత పెళ్లి చేసుకోకుండా ఎలా అయినా సంతోషంగా ఉండవచ్చు. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటే మీ లైఫ్ సూపర్. లేదా నరకం. మరి ఆలోచించి ముందడుగు వేయండి. ఒకసారి మంచి భాగస్వామి దొరికితే ఇన్ని రోజులు ఒంటరిగా ఎందుకు ఉన్నామని మీరే ఫీల్ అవుతారు. కానీ అర్థం చేసుకోలేని భాగస్వామి దొరికితే మాత్రం ఎందుకు పెళ్లి చేసుకున్నామా అనిపిస్తుంది. మొత్తం మీద ఆల్ ది బెస్ట్.