https://oktelugu.com/

Bharateeyudu 2 Twitter Review: భారతీయుడు 2 ట్విట్టర్ రివ్యూ: ఆడియన్స్ నుండి షాకింగ్ రెస్పాన్స్, కమల్ మూవీ హిట్టా ఫట్టా?

1996లో వచ్చిన భారతీయుడు ఆల్ టైం క్లాసిక్. శంకర్ ఓ అద్భుతమైన ఆలోచనతో కథ రాసుకున్నాడు. ఒకప్పుడు తెల్లదొరల మీద యుద్ధం చేసిన ఫ్రీడమ్ ఫైటర్ నేటి స్వతంత్ర భారతంలో వేళ్లూనుకుపోయిన అవినీతి మీద యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది?... ఈ కాన్సెప్ట్ ని గొప్పగా తెరకెక్కించాడు శంకర్. ఒక వృద్ధుడు హత్యలకు పాల్పడటం. రౌడీలను ఇరగొట్టడం చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో హీరోకి మర్మ కళ వచ్చు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 12, 2024 / 08:00 AM IST

    Bharateeyudu 2 Twitter Review

    Follow us on

    Bharateeyudu 2 Twitter Review: కమల్ హాసన్ కెరీర్లో భారతీయుడు ఒక మైలురాయి. దర్శకుడు శంకర్-కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ. వీరిద్దరూ కలిసి మరో చిత్రం చేయలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్ భారతీయుడు 2 రూపొందించారు. జులై 12న భారతీయుడు 2 వరల్డ్ వైడ్ పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ ముగిశాయి. ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

    1996లో వచ్చిన భారతీయుడు ఆల్ టైం క్లాసిక్. శంకర్ ఓ అద్భుతమైన ఆలోచనతో కథ రాసుకున్నాడు. ఒకప్పుడు తెల్లదొరల మీద యుద్ధం చేసిన ఫ్రీడమ్ ఫైటర్ నేటి స్వతంత్ర భారతంలో వేళ్లూనుకుపోయిన అవినీతి మీద యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది?… ఈ కాన్సెప్ట్ ని గొప్పగా తెరకెక్కించాడు శంకర్. ఒక వృద్ధుడు హత్యలకు పాల్పడటం. రౌడీలను ఇరగొట్టడం చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో హీరోకి మర్మ కళ వచ్చు.

    మనిషిని కేవలం వేళ్ళతో చంపేయగల ఈ మర్మ కళ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేయగా… మనీషా కొయిరాలా, ఊర్మిళ హీరోయిన్స్ గా నటించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన భారతీయుడు చిత్రానికి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత శంకర్ సీక్వెల్ తెరకెక్కించాడు. మరి పార్ట్ 2 భారతీయుడు స్థాయిలో ఉందా?

    ఆడియన్స్ అభిప్రాయంలో భారతీయుడు ఫస్ట్ హాఫ్ యావరేజ్ అంటున్నారు. సినిమా ఓపెనింగ్ బాగుంది. హీరో సిద్దార్థ్ మీద తెరకెక్కిన ప్రారంభ సన్నివేశాలు ఆసక్తిరేపుతాయి. దర్శకుడు శంకర్ నేరుగా పాయింట్ లోకి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ సోషల్ మీడియా ద్వారా దేశంలో పెరుగుతున్న అవినీతి మీద అవగాహన కల్పిస్తూ ఉంటాడు. భారతీయుడు పార్ట్ 1 సేనాపతి కొడుకును చంపి విదేశాలకు వెళ్లిపోవడంతో ముగుస్తుంది. పార్ట్ 2 అక్కడినే నుండే మొదలవుతుంది. సేనాపతి(ఓల్డ్ కమల్ హాసన్) మరలా ఇండియాకు వస్తాడు.

    ఫస్ట్ హాఫ్ లో 20 నిమిషాల ప్రారంభం, యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ మెప్పిస్తాయి. అనూహ్యంగా కమల్ ఎంట్రీ తర్వాత మూవీ నెమ్మదిస్తుంది. భారీ డైలాగ్స్, సాగదీతతో కూడిన సన్నివేశాలు నిరాశపరుస్తాయి. సెకండ్ హాఫ్ సీరియస్ నోట్ లో స్టార్ట్ అవుతుందట. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుందని అంటున్నారు. అనిరుధ్ మ్యూజిక్ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. అంత సంతృప్తికరంగా లేదనే అభిప్రాయం వినిపిస్తుంది. తెలుగు సాంగ్స్ నిరాశపరిచాయట.

    శంకర్ ఓల్డ్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ మెప్పించలేదని సమాచారం. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ, ఎస్ జే సూర్య తమ పాత్రలకు న్యాయం చేశారు. మొత్తంగా భారతీయుడు చిత్రం దరిదాపుల్లో కూడా భారతీయుడు 2 లేదు. నిజానికి భారతీయుడు వంటి సబ్జెక్టుని శంకర్ మరోసారి టచ్ చేయకపోతే బాగుండేది. ఏ మాత్రం శంకర్ అంచనాలు అందుకోలేకపోయాడని అంటున్నారు.

    అలాగే ఈ మూవీ అనేక వివాదాల మధ్య తెరకెక్కింది. 2019లో షూటింగ్ ప్రారంభం కాగా విడుదలకు ఐదేళ్లకు పైగా సమయం పట్టింది. కారణం దర్శకుడు శంకర్ కి నిర్మాతలకు మధ్య విబేధాలు తలెత్తాయి. దాంతో మూవీ మధ్యలో ఆగిపోయింది. షూటింగ్ సెట్స్ లో ప్రమాదం జరిగింది ఇద్దరు యువకులు మరణించారు. విక్రమ్ సక్సెస్ కావడంతో భారతీయుడు 2 చిత్రాన్ని మరలా తెరపైకి తెచ్చారు. మొత్తంగా సినిమా ఫలితం ఏమిటో తెలియాలంటే పూర్తి రివ్యూ వరకు వేచి చూడాలి..