Home Loan: వ్యక్తిగత, గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు పెరుగుతున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలని సామాన్యుడికి డబ్బు చేతిలో ఉండకపోవడంతో రుణాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు రెపోరేటును మరో 0.35 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆందోళనకు తావిస్తోంది. తాజాగా వడ్డీ రేటు పెంచడంతో రెపోరేటు 6.25 శాతానికి చేరుకోవడం గమనార్హం. ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు ఐదోసారి. తరువాత మూడు సార్లు 0.50 చొప్పున పెంచుతోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముప్పుతోనే ఆర్థిక మాంద్యం ముప్పు ఏర్పడింది. వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 4.4 శాతానికి, నాలుగో త్రైమానికంలో 4.2 శాతానికి పరిమితమవుతుందని ఆర్బీఐ భావించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి రిటైల్ ద్రవ్బోల్బణం 6 శాతం దిగువకు చేరుకుంటుంది. ద్రవ్యోల్బణం సగటు అంచనా 6.7 శాతానికి చేరుకోనుంది.
ఆర్బీఐ పాలసీలపై స్టాక్ మార్కెట్ కు ప్రతికూలత ఎదురవుతోంది. వడ్డీరేట్లపై ఆటో బ్యాంకింగ్, రియల్టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 215.68 పాయింట్లు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. నిఫ్టీ 82.25 పాయింట్లు నష్టంతో 18,560.50 వద్ద ముగిసింది. కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ రూపాయి వినియోగంలో భయపడాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలో టోకు లావాదేవీల కోసం గత నెల ప్రారంభించిన సేవలు సంతృప్తి కరమన్నారు.

గృహ రుణాలు భారంగా మారుతున్నాయి. రెపోరేటు 4 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది. సగటు వినియోగదారుడిపై పెనుభారం పడనుంది. ఈ నేపథ్యంలో పెరిగిన రెపో రేటు కారణంగా వడ్డీ రేట్ల భారం తగ్గించుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కొత్తగా లోన్ తీసుకునే వారికే కాకుండా పాత వారికి కూడా ఇదే రేటు వర్తిస్తుంది. వడ్డీల భారం రెట్టింపు కానుంది. మీకు ఒకవేళ యాన్యూవల్ ఇన్వెస్టివ్స్, బోనస్ వంటివి వస్తాయి. రుణంపై వడ్డీ పెరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.