Popcorn: మనం ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బయట తిండ్లను దూరం చేసుకుంటున్నారు. గతంలో మనకు సినిమాకు వెళ్లినా బయటకు వెళ్లినా ఆకలి తీరేందుకు ఏది పడితే అది తినేవాళ్లం. స్నాక్స్ తినడానికి మొగ్గు చూపేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. బయట తిళ్లకు వెనకాడుతున్నారు. ఇంట్లోనే చేసుకుని తినేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. బయట మనం ఎక్కువగా పాప్ కార్న్ తింటుంటాం. బయట తయారు చేసే పదార్థాల్లో చక్కెర, ఉప్పు ఎక్కువ మోతాదులో కలపడంతో వాటిని తినడం ఇబ్బందే. రోగాలు రావడానికి బయట తిండ్లే కారణంగా చెబుతుంటారు. అందుకే బయట పదార్థాలు తినేందుకు సమ్మతించడం లేదు.

పాప్ కార్న్ తినడం వల్ల మనకు నష్టం లేదు. లాభాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పాప్ కార్న్ సులభంగా జీర్ణం అవుతుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు పాప్ కార్న్ తినడం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పాప్ కార్న్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్లు, మాంగనీసు, మెగ్నిషియం తదితర పోషకాలు ఉండటం వల్ల మనకు ఆరోగ్యం దరి చేరుతుంది. ఎలాంటి రోగాలు దరిచేరవు. పాప్ కార్న్ తింటే మనకు ఎన్నో లాభాలున్నాయి.
పాప్ కార్న్ తినడం వల్ల కొవ్వు కరుగుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గేందుకు ఇది దోహదం చేస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. రోజు తింటే పేగులు సాఫీగా ఉంటాయి. షుగర్ ఉన్న వారికి కూడా ఇది మంచి మందులా పనిచేస్తుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. రక్తహీనతను దూరం చేస్తుంది. రక్తం బాగా తయారవుతుంది. గ్యాస్, అజీర్తి సమస్యలను రాకుండా చేస్తాయి.

పాప్ కార్న్ మంచిదే అయినా బయట చేసినవి తినకూడదు. ఇంట్లోనే తయారు చేసుకోవాలి. బయట లభించే వాటిలో ఫ్లేవర్స్ కలుపుతారు. సహజసిద్ధంగా పాప్ కార్న్ ను తయారు చేసుకుని తింటే లాభాలుంటాయి. ఇతర పదార్థాలు కలిపితే మనకు నష్టాలు వస్తాయి. బయట దొరికే పాప్ కార్న్ లో ఎన్నో రకాల పదార్థాలు కలపడం వల్ల వాటిని తినడం శ్రేయస్కరం కాదు. మన ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వల్ల మనకు ప్రయోనాలు కలుగుతాయి. దీంతో ఆరోగ్యం కలుగుతుంది. పాప్ కార్న్ ను ఇంట్లనే తయారు చేసుకుని తినేందుకు ప్రాధాన్యం ఇస్తే సరిపోతుంది.