OG Movie Break Even: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. రేపటితో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 174 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 9 రోజుల్లో 167 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. నేడు ఒక మూడు కోట్ల రూపాయిల షేర్, రేపు మరో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఎల్లుండి నుండి ఈ చిత్రానికి ఎంత షేర్ వసూళ్లు వచ్చినా అది లాభాల లెక్కలోకి చెల్లుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కుకి ఈ సినిమా కొంత దూరంలో ఉంది.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి 121 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 145 కోట్ల రూపాయిల వరకు ఉంది. నేడు, రేపు వీకెండ్ కాబట్టి, ఈ రెండు రోజుల్లో ఈ చిత్రం భారీ రేంజ్ లో రీకవరీ ని అందుకోవచ్చు. అంటే 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అన్నమాట. మిగిలిన 15 కోట్ల రూపాయిలు రీకవర్ అవ్వాలంటే కచ్చితంగా లాంగ్ రన్ ఉండాలి. విడుదల రోజు నుండి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ ని గమనిస్తే , కలెక్షన్స్ చాలా స్టడీ గా ఉన్నాయి. ఇది లాంగ్ రన్ ని సూచిస్తుంది. కాబట్టి కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నైజాం ప్రాంతం లో రేపటితో బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరకి వస్తుంది ఈ చిత్రం. కృష్ణ, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ సినిమా, సీడెడ్, ఉత్తరాంధ్ర మరియు నెల్లూరు జిల్లాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాల్సి ఉంది. ఉత్తరాంధ్ర, సీడెడ్ మరియు నెల్లూరు జిల్లాల్లో భారీ రేట్స్ కి ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ లో 23 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగితే నిన్నటితో 17 కోట్ల మార్కు ని అందుకుంది. నెల్లూరు లో 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే నిన్నంతో 4 కోట్ల 30 లక్షలు వచ్చాయి. ఈ మూడు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయితే టార్గెట్ ని చేరుకున్నట్టే, చూడాలి మరి లాంగ్ రన్ ఎలా ఉండబోతుంది అనేది.