IPL Mega Auction 2022: ఐపీఎల్ పండుగకు వేళయింది. ఆటగాళ్ల వేలానికి సమయం ఆసన్నమైంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఆటగాళ్ల కూర్పుతో ఎలాగైనా విజయాలు సొంతం చేసుకోవాలని భావిస్తున్నాయి. దీంతో ఆటగాళ్లకు కూడా డిమాండ్ ఏర్పడుతోంది. గెలుపు గుర్రాల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. దీంతో టాలెంట్ ఉన్న బౌటర్ల కోసం ఆరా తీస్తున్నాయి. విజయంలో కీలక పాత్ర పోషించే టీమిండియా జట్టులోని ప్రధాన బౌలర్లపై ఫోకస్ పెడుతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం భారత అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎందరో ఎదురుచూస్తున్నారు. మ్యాచుల నిర్వహణపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ల నిర్వహణకు ఫ్రాంచైజీలు సిద్ధం అవుతున్నాయి. ఆటగాళ్ల వేలం ఇవాళ బెంగుళూరులో జరగనుంది. దీనికి ఆటగాళ్లతోపాటు ఫ్రాంచైజీలు పాల్గొని వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు రానున్నారు. ఈ క్రమంలో ఆటగాళ్ల ప్రతిభకు ప్రతిఫలం దక్కనుంది. వారిని తమ జట్టు తరఫున ఆడించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దీంతో టీమిండియాలో అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను కట్టడి చేసే విధంగా చెలరేగిపోయే బౌలర్ల కోసం ఫ్రాంచైజీలు ముందుకు రానున్నాయి. ఇందులో ప్రధానంగా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి చెప్పుకోవాలి. బంతితో బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టే అశ్విన్ ఆటను అర్థం చేసుకుని తదనుగుణంగా బంతులు వేసేందుకు నిష్ణాతుడై ఉండటంతో ఇతడి కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇతడి కోసం కోల్ కతా నైట్ రైడర్స్, బెంగుళూరు చాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం.

మరో బౌలర్ గతేడాది పంజాబ్ కింగ్స్ ప్రాతినిధ్యం వహించిన మహ్మద్ షమిపై కూడా అందరు ఫోకస్ పెడుతున్నట్లు చెబుతున్నారు. గత సీజన్ లో 14 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. దీంతో ఇతడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయని తెలుస్తోంది. దీంతో షమీ ని వేలంలో దక్కించుకుని తమ జట్టు విజయానికి దోహదం చేసేందుకు ముందుకు రావాలని భావిస్తున్నాయి.
Also Read: ఇది జగన్ టైం.. చంద్రబాబు ఓపిక పట్టాల్సిందేనా?
తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును ఇబ్బందుల్లోకి నెట్టే బౌలర్ యజువేంద్ర చాహల్. వన్డే జట్టులో కూడా తన ప్రతిభతోనే అందరి ప్రశంసలు పొందే చాహల్ ను ఫ్రాంచైజీలు వేలంలో దక్కించుకోవాలని చూస్తున్నాయి. దీంతో చాహల్ ను తమ జట్టు తరఫున ఆడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బౌలర్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలోనే చాహల్ కు కూడా మంచి పట్టు ఉండటంతోనే అతడిని తీసుకునేందుకు పోటీ పడనున్నట్లు సమాచారం. బెంగుళూరు చాలెంజర్స్ ఆడినా ప్రస్తుతం దానికి ప్రాతినిధ్యం వహించడం లేదు. దీంతో అతడి కోసం ఏ ఫ్రాంచైజీ ముందుకొస్తుందో చూడాల్సిందే.
మరోవైపు హర్షల్ పటేల్, దీపక్ చాహర్ లను కూడా జట్టులో మంచి గుర్తింపు ఉండటంతో వారిని కూడా ఫ్రాంచైజీలు తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా వేలంలో తీసుకోవాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఐపీఎల్ నిర్వహణకు సమయం దగ్గర పడుతుండటంతో అటు అభిమానులు, ఇటు ఫ్రాంచైజీల్లో ఆసక్తి పెరుగుతోంది. మ్యాచ్ ల నిర్వహణకు తమదైన శైలిలో విజయం సాధించాలని అవి భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: బీజేపీపై వ్యతిరేకతను ప్రజలకు ఎక్కించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారా?