IPL 2022: ఐపీఎల్ రెండు వారాలుగా నాన్ స్టాప్ ఎంటర్ టైన్‌మెంట్ ను అందిస్తోంది. ఊహించని ట్విస్టులతో మ్యాచ్‌లు అదిరిపోతున్నాయి. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అయితే ఈ సారి లెజెండ్ ఆటగాళ్లు రాణించకపోయినా.. మేమున్నామంటూ యువ ఆటగాళ్లు తమలోని ప్రతిభను బయట పెట్టేస్తున్నారు. పదునైన బౌలింగ్ తో కొందరు ఆకట్టుకుంటుంటే.. ఉరుముల్లాంటి ఇన్నింగ్స్ తో మరికొందరు బ్యాట్స్ మెన్స్ దుమ్ములేపుతున్నారు.

ఈ సారి చాలామంది ఆవరేజ్ ఆటగాళ్లు చాలా ఫేమస్ అవుతున్నారు. వారి ఆటతీరు నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు ఆరెంజ్ క్యాప్ అందుకోవడానికి బ్యాట్స్ మెన్స్ తీవ్ర కష్టపడుతుంటే.. అటు బౌలర్లు కూడా పర్పుల్ క్యాప్ అందుకోవడానికి యువ బౌలర్లు దుమ్ములేపేస్తున్నారు.
Also Read: Prashanth Neel: హిట్ అయితేనే పార్ట్ 2 అంటున్న ప్రశాంత్ నీల్
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు పర్పుల్ క్యాంప్ అందుకునే బౌలర్ల లిస్టులో అగ్ర స్థానంలో యుజ్వేంద్ర చాహల్ కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్ ఆడిన చాహల్.. 11వికెట్లు తీశాడు. ఇక అతని తర్వాత కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. అతను 4మ్యాచుల్లో 10వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ కూడా లెగ్ స్పిన్నర్లు కావడం విశేషం.

ఇక వీరి తర్వాత కోల్ కతా పేసర్ ఉమేశ్ యాదవ్ 5 మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఆడుతున్న శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ 8 వికెట్లతో నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. ఇక సన్ రైజర్స్ బౌలర్ టి నటరాజన్ కూడా టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. అతను కూడా హసరంగతో సమానంగా 8 వికెట్లు తీశాడు. ఇదులో ఉమేశ్ యాదవ్ పొదుపైన బౌలర్ గా కొనసాగుతున్నాడు. అతను ఇప్పటి వరకు 62 డాట్ బాల్స్ వేశాడు.
ఇక ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే రాజస్థాన్ తరఫున ఆడుతున్న జోస్ బట్లర్ అగ్ర స్థానంలో ఉన్నాడు. అతను 4 మ్యాచుల్లో 218 పరుగులు చేశాడు. రెండో స్థానంలో లక్నో తరఫున ఆడుతున్న క్వింటన్ డికాక్ 4 మ్యాచుల్లో 188పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న శుభ్ మన్ గిల్ మూడో ప్లేస్ లో ఉన్నాడు.

ఇతను 4 మ్యాచుల్లో 187రన్స్ చేశాడు. ఇక ముంబై తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్ 175రన్స్ తో నాలుగో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ ఆటగాడు షిమ్రోన్ హెట్మైర్ 168 రన్స్ తో టాప్ 5లో ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు అన్ని టీమ్ లు కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సమీకరణాలు మారే అవకాశం కూడా ఉంది. ఇండియా తరఫున ఆడుతున్న సీనియర్లు ఇంకా రేస్ లోకి రాలేదు. వారు వస్తే ఫలితాలు మరో లెవల్ లోనే ఉంటాయన్నది తెలిసిందే.
Also Read:Kodali Nani: కొడాలి నానికి సీఎం జగన్ చెప్పిన సీక్రెట్ ఏంటి?
[…] Also Read: IPL 2022: ఐపీఎల్: యమ రంజుగా అత్యధిక పరుగులు,… […]