Sleeping Problem: మనలో చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ఈ ఆరోగ్య సమస్యలలో కొన్ని ఆరోగ్య సమస్యలు ప్రమాదకరం అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రం ప్రమాదకరం కాదు. మనలో కొంతమంది రాత్రి సమయంలో నిద్రలేమి సమస్యతో బాధ పడుతుంటారు. నిద్రలేమి సమస్య చిన్న సమస్యే అయినా ఈ సమస్య ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది.
ఒత్తిడి, ఆందోళన, వ్యక్తిగత సమస్యల వల్ల కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతుంటే మరి కొందరు ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. నిద్రలేమి సమస్యను తేలికగా తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. నిద్రలేమి సమస్యతో బాధ పడేవాళ్లు రాత్రి సమయంలో పరిమితంగా ఆహారం తీసుకుంటే మంచిది. రాత్రి భోజనం లో పెరుగు ఉండేలా చూసుకుంటే నిద్ర సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు.
Also Read: AP Special Status: ఆంధ్రులకు ‘ప్రత్యేక హోదా’ వచ్చినట్లేనా..? అంతలోనే ట్విస్ట్
రాత్రి సమయంలో మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ ను చూడకుండా ఉంటే కూడా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు. టీ లేదా కాఫీలను తాగడం ద్వారా కూడా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కరోనా సోకి వైరస్ నుంచి కోలుకున్న వాళ్లను కూడా నిద్రలేమి సమస్య వేధిస్తోంది. నిద్రలేమి సమస్యను మందులతో అధిగమించే ఛాన్స్ ఉన్నా ఎక్కువకాలం మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
మానసిక సమస్యల వల్ల నిద్రలేమి సమస్య వేధిస్తుంటే మానసిక నిపుణులను సంప్రదిస్తే మంచిది. కొన్ని వ్యాధులకు నిద్రలేమి కూడా ఒక సంకేతం అని చెప్పవచ్చు. రోజులో తక్కువ సమయం నిద్రపోతున్నారంటే వెంటనే వైద్యుల సలహాల ప్రకారం మందులను వాడటం ద్వారా సమస్యను అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: వార్నర్‌ను వదిలేసిన సన్ రైజర్స్.. నెట్టింట ట్రోల్స్‌తో రెచ్చిపోతున్న క్రికెట్ లవర్స్..!