Amazon Prime: ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ వ్యూయర్స్ ను పెంచుకునే దిశగా అడుగులు వేసున్న సంగతి తెలిసిందే. ఇతర ఓటీటీ కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా అమెజాన్ ప్రైమ్ కు ఏకంగా 55 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉండటం గమనార్హం. గతేడాది డిసెంబర్ నెలలో అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ధరలను 999 రూపాయల నుంచి 1499 రూపాయలకు పెంచింది.
ఈ ఆఫర్ ద్వారా సబ్ స్క్రిప్షన్ తీసుకునే వాళ్లు తమ సెల్ఫీతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలను అందజేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు. అమెజాన్ ప్రైమ్ ఏడాది ప్యాక్ 1499 రూపాయలకు తీసుకుంటే 750 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అమెజాన్ ప్రైమ్ మూడు నెలల ప్యాక్ ను తీసుకుంటే 230 రూపాయలు క్యాష్ బ్యాక్ గా పొందే ఛాన్స్ ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ నెలరోజుల ప్యాక్ ను తీసుకుంటే 90 రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అమెజాన్ పే అకౌంట్ లో ఈ క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. అమెజాన్ పే అకౌంట్ లో ఉన్న డబ్బులను అవసరానికి అనుగుణంగా వినియోగించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.