Inspirational Life Message: అందమైన జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ అందుకు అనుగుణంగా జీవించాలని అనుకోరు. పుట్టగానే ఎవరు పూల పాన్పుపై పడుకోరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సవాళ్లు.. ఎదురుదెబ్బలు.. కష్టాలు అన్నీ ఉంటాయి. వీటిని కొందరు మాత్రమే ఛేదించగలుగుతారు. అలా చేదించిన వారే అందమైన జీవితాన్ని పొందుతారు. అసలు జీవితం అందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి సౌకర్యాలు ఉండాలి? ఎలా ప్రవర్తించాలి?
ప్రతి మనిషికి కావలసింది కూడు, గుడ్డ, గూడు.. అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. వీటిలో మొదటి రెండింటిని ఎలాగైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ గూడు ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేకంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రతిరోజు అవసరాలతో పాటు కాస్త డబ్బు కూడా పెట్టి సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలి. ఎందుకంటే జీవితాంతం అద్దె ఇంట్లో ఉండడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా అందమైన జీవితం కావాలని కోరుకునే వారు తప్పనిసరిగా సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. సొంత ఇంట్లో ఉన్న సుఖం మరి ఎక్కడ దొరకదని కొందరు అంటుంటారు. ఎందుకంటే సొంత ఇంట్లో ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ అదే ఇంట్లో ఏ చిన్న పొరపాటు చేసిన బయటకు నెట్టిస్తారు. అందువల్ల జీవితం ఆనందమయంగా ఉండాలంటే ముందుగా సొంత ఇల్లును ఏర్పాటు చేసుకోవాలి. సొంత ఇల్లు ఉంటే జీవితాంతం ఎలాగైనా బతికే అవకాశం ఉంటుంది.
సొంత ఇల్లు ఉన్నవారు సమాజంలో గుర్తింపు రావాలని కొందరు కోరుకుంటూ ఉంటారు. సమాజంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. కానీ అందరినీ ఒకే రకంగా భావిస్తూ.. వారితో కలిసి పయనించే వారే.. గమ్యాన్ని చేరుకుంటారు. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకు విభేదాలు, వివాదాలతో ముడిపడితే చివరివరకు చేరే అవకాశం ఉండదు. అంతేకాకుండా గుర్తింపును కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల సమాజంలో అందరితో కలిసి మెలిసి ఉండాలంటే ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటూ వారితో కలిసిపోయే ప్రయత్నం చేయాలి.
Also Read: Life Lessons From Struggles: కష్టాల్లో ఉన్నవారు ఈ ఐదు విషయాలను నేర్చుకుంటారు..
అందమైన జీవితంలో మరో భాగం ఇంటికి వచ్చేవారికి మర్యాదగా ప్రవర్తించడం. కొంతమంది తమ ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉందని పిలుస్తారు. కానీ వచ్చిన వారిని పట్టించుకోరు. వారికి సరైన విధంగా భోజనం వడ్డించరు. అంతేకాకుండా వారు ఎప్పుడు బయటకు వెళ్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి వారి ప్రవర్తనతో బంధువులు దూరమై.. ఒంటరిగానే మిగిలిపోతారు. చివరికి ఆపద సమయంలో.. అవసరమైన సమయంలో పిలిస్తే రాని పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా వారితో అవసరం ఏర్పడినప్పుడు వారు దూరం పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంటికి వచ్చే వారిని దేవుళ్ళుగా భావించి వారితో మర్యాదగా ప్రవర్తించి.. కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా భవిష్యత్తులో వారితో ఏ అవసరం ఏర్పడిన వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది.
ఇలా జీవితానికి ఈ మూడు విషయాలు ఎంతో అవసరమని కొందరు మేధావులు చెబుతున్నారు. అందమైన జీవితం కావాలని కోరుకునే వారు ఈ మూడు విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటే వారి మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా సమాజంలో మంచి పేరు వస్తుందని చెబుతున్నారు.