India vs Bangladesh టీమిండియా 11ను పరాజయాలు వెంటాడుతున్నాయి. ఫలితంగా అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ నుంచి వెనుదిరగడంతో ఆటగాళ్ల తీరుపై పెద్దఎత్తున అభిమానులు తిట్ల దండకం అందుకుంటున్నారు. సులభంగా గెలవాల్సిన మ్యాచుల్లో వెన్ను చూపడం మనవారికి అలవాటుగా మారింది. విజయం సాధించాల్సిన మ్యాచులు ప్రత్యర్థులకు అప్పగించి చేతులు ఊపుకుంటూ రావడం పరిపాటిగా మారింది. చివరకు బంగ్లాదేశ్ చేతిలో సైతం క్షౌవరం చేయించుకున్న వైనంపై విమర్శలు ఇంకా ఘాటుగానే వస్తున్నాయి. ఈ కారణంగానే బీసీసీఐ కూడా దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. ఆటగాళ్లను మార్చాలని భావిస్తోంది.

బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ వేలికి గాయం కావడంతో అతడికి మొదటి టెస్టుకు విశ్రాంతి కల్పించారు. రెండు టెస్టుల మ్యాచ్ లో రోహిత్ దూరం కావడంతో కెప్టెన్సీ ఎవరికి ఇస్తారనే దానిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉండటంతో ఆటగాళ్ల ఎంపిక ప్రాధాన్యం సంతరించుకుంది. డిసెంబర్ 14 నుంచి బంగ్లాదేశ్ లో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే కెప్టెన్సీ ఎవరికి ఇస్తారనే దానిపై సందేహాలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ లో వన్డే సిరీస్ లో భారత్ 1-2 తేడాతో ఓడిపోవడం గమనార్హం. రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కెప్టెన్సీ కేఎల్ రాహుల్ అప్పగించనున్నారని చెబుతున్నారు. తొలి టెస్టుకు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా ఉంచనున్నారు. రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులో రానున్నాడని చెబుతున్నారు. దీంతో టీమిండియా వైస్ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనే దాని మీద అందరు రిషబ్ పంత్ ను తీసుకుంటారని అనుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనతో అతడికి కాకుండా చతేశ్వర్ పూజారాను వైస్ కెప్టెన్ గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.

ఇక తొలి టెస్టులో రిషబ్ పంత్ ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. సోమవారం నెట్స్ లో శ్రీకర్ భరత్ కీపింగ్ చేయడంతో పంత్ ను తీసుకోవడం లేదనే సూచనలు తెలియజేస్తోంది. తుది జట్టులో రిషబ్ పంత్ కు చోటు దక్కడం సందేహంగానే ఉంటోంది. ఇటీవల కాలంలో రిషబ్ పంత్ ప్రదర్శన బాగా లేకపోవడంతో అతడిపై చర్యలు తప్పనిసరని చెబుతున్నారు. ఇన్నాళ్లుగా అవకాశాలు ఇస్తున్నా అతడు మాత్రం సద్వినియోగం చేసుకోవడం లేదు. ఫలితంగా ఇప్పుడు పంత్ పై వేటు వేస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి.
బంగ్లాదేశ్ ఏం చేస్తుందిలే అనుకుని ఏమరుపాటుగా ఉండటంతోనే మన టీమిండియా 11 అపజయాల బారిన పడింది. ఫలితంగా బంగ్లాదేశ్ వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని టెస్టు మ్యాచులకు ఆచితూచి అడుగేస్తోంది. ఇందులో భాగంగానే ఆటగాళ్లను మారుస్తోంది.
బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు టీమిండియా 11 ఇదే
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.