
India vs Australia 2nd Test: తొలి టెస్ట్ విజయంలో భారత్ టాప్ ఆర్డర్ పాత్ర నామమాత్రంగా నైనా లేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే మొక్కవోని దీక్షతో శతకం సాధించాడు.. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, చటేశ్వర్ పూజార, కేఎల్ రాహుల్ వెంట వెంటనే అవుట్ అయ్యారు.. అయినప్పటికీ స్పిన్నర్ల ప్రతిభతో రెండున్నర రోజుల్లోనే భారత్ ఘన విజయం సాధించింది. అందుకే ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగే రెండో టెస్టులో ఈ నలుగురిపైనే అందరి దృష్టి ఉంది.. పైగా పూజరాకు ఇది 100 టెస్ట్.. వీరంతా కూడా తమ స్థాయి ఆటతీరుతో జట్టుకు రెండో టెస్ట్ విజయాన్ని కట్టబెట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
వాస్తవానికి ఈ టోర్నీ మొదలుకు ముందే పూజారా, విరాట్ కోహ్లీ, రాహుల్ పై భారీ అంచనాలు ఉండేవి.. ఎందుకంటే వారికి ఆస్ట్రేలియా మీద మంచి ట్రాక్ రికార్డు ఉంది కనుక. కానీ మొదటి టెస్టులో వారు అవుట్ అయిన తీరు చూస్తే దీనికోసమే నా వీరుని ఎంపిక చేసింది అనే అనుమానం కలగక మానదు.. వీరికంటే వర్ధమాన ఆటగాళ్లు బాగా ఆడతారు కదా అనే భావన కలిగింది.. ఇక తొలి టెస్ట్ లో విఫలమైన ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్ మైదానంలో తీవ్రంగా శ్రమించారు. నెట్స్‌లో చెమటోడ్చారు. ముఖ్యంగా స్పిన్నర్లతో ఎక్కువ బంతులు వేయించుకొని తమ లోపాలు ఏమిటో గుర్తించారు.. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.. ఇక తొలి టెస్ట్ వైఫల్యం వారిలో కసిని పెంచింది అనేందుకు ఇవి ఉదాహరణలు. కీలక ఆటగాళ్ల వైఫల్యం ఇబ్బంది పెడుతున్నప్పటికీ పూర్తి ఆత్మవిశ్వాసంతో టీమిండియా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో రెండవ టెస్టుకు బరిలోకి దిగుతోంది..

ఇక నాగపూర్ లో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న ఆస్ట్రేలియా ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. అయితే తొలి టెస్టులో ఎదురైన పరాభవం నుంచి త్వరగా కోలుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. దీనికోసం తుది జట్టులో మార్పులు చేయబోతోంది.. 2013 తర్వాత ఈరిజట్లు ఇక్కడ ఆడబోతున్నాయి.. ఢిల్లీలో ఆస్ట్రేలియాకు ఇది ఎనిమిదో టెస్ట్ కాగా.. భారత్‌లో ఈ జట్టు ఎక్కువగా ఆడింది ఈ విధానంలోనే కావడం విశేషం.. ఇందులో ఒక టెస్ట్ (1959 _ 60) గెలవడం విశేషం.
వరుసగా విఫలమవుతున్నప్పటికీ రాహుల్ కు ఎలా అవకాశాలు ఇస్తున్నారు అంటూ ఇప్పటికే సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిభావంతులైన ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురు చూస్తుంటే అతడినే కొనసాగించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఓపెనింగ్ స్థానంలో గిల్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న రాహుల్ కు ఈ మ్యాచ్ లిట్మస్ టెస్ట్ లాంటిదే. మరోసారి విఫలమైతే చివరి రెండు టెస్టుల కోసం ప్రకటించే జట్టులో అతని పేరు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. ఇక శ్రేయస్ ఫిట్ గా ఉన్నట్టు ప్రకటించడంతో తుది జట్టులో ఉంటాడా? లేక సూర్య కుమార్ కు మరో అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.. నెల రోజులపాటు అయ్యర్ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నేరుగా టెస్టులు ఆడించడం రిస్క్ అవుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సొంత గడ్డపై చెలరేగాలి అనే కసితో విరాట్ ఉన్నాడు.. అశ్విన్, జడేజా, అక్షర్ బంతి తోనే కాకుండా… బ్యాట్ తో కూడా ఆకట్టుకోవడం జట్టుకు బలంగా మారింది.
తొలి టెస్ట్ లో ఘోరంగా విఫలమైన ఆసీస్ వీలైనంత త్వరగా ఆ ఇనింగ్స్ ఓటమిని మర్చిపోవాలనుకుంటుంది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ఈ ఫార్మాట్లో ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. అతడి పేలవ ఫామ్ జట్టును ఇబ్బందులకు గురిచేస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో షమీ బంతికి అతడి ఆఫ్ స్టంప్ అల్లంత దూరాన పడటం గుర్తుండే ఉంటుంది. లబు షేన్, స్మిత్ నుంచి మాత్రమే పోరాటం కనిపించింది.. అదనంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మ్యాట్ కునే మన్ ను జట్టులోకి చేర్చారు. మర్ఫీ సూపర్ షో తర్వాత మ్యాట్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది..పేసర్ మిచెల్ స్టార్క్, ఆల్ రౌండర్ గ్రీన్ ఫిట్నెస్ పై సందేహాలు ఉన్నాయి. స్టార్క్ ఫిట్ గా ఉంటే బోలాండ్ స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం కూడా స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో ఆస్ట్రేలియా కూడా భారత్ మాదిరి ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఒక వికెట్ సాధిస్తే టెస్టుల్లో 250 వికెట్లు సాధించిన ఘనతను భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా సొంతం చేసుకుంటాడు. ఇక 1987 నుంచి ఢిల్లీలో భారత జట్టు టెస్ట్ ఓడిపోలేదు. ఇప్పటివరకు అనిల్ కుంబ్లే ఆస్ట్రేలియా మీద 111 వికెట్లు తీస్తే… అశ్విన్ 97 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. కెరియర్ లో 100 టెస్ట్ ఆడబోతున్న పూజారాను ఢిల్లీ క్రికెట్ సంఘం ఘనంగా సత్కరించనుంది. శుక్రవారం తొలి రోజు మ్యాచ్ ఆరంభానికి ముందు పూజారకు మెమెంటోను బహుకరించనుంది. ఇందులో డి డి సి ఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ, ఆఫీస్ బేరర్లు పాల్గొననున్నారు.. మరోవైపు బీసీసీఐ కూడా విడిగా అతనిని సత్కరించనుంది. 2010లో అరంగేట్రం చేసిన పూజార ద్రవిడ్ తర్వాత నెంబర్ 3 స్థానంలో జట్టుకు అద్భుత విజయాలను అందించాడు. భారత జట్టుకు డబ్బ్యుటిసి టైటిల్ అందించడమే తన లక్ష్యమని పూజార చెబుతున్నాడు.
జట్ల అంచనాలు
భారత్; రోహిత్( కెప్టెన్), రాహుల్, పూజార, విరాట్ కోహ్లీ, అయ్యర్/సూర్య కుమార్, జడేజా, భరత్, అశ్విన్, అక్షర్, షమీ, సిరాజ్.
ఆస్ట్రేలియా
వార్నర్, ఖవాజా, లబు షేన్, స్మిత్, హెడ్, హ్యాండ్స్ కోబ్/ గ్రీన్,క్యారీ, కమిన్స్ ( కెప్టెన్), బోలాండ్, స్టార్క్, మర్ఫీ, లయాన్.