T20 World Cup 2022- India: ఆస్ట్రేలియా వాతావరణం ఒక పట్టాన అర్థం కాదు. అప్పుడే ఎండ కాస్తుంది. వెంటనే వర్షం దంచి కొడుతుంది. అందుకే ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ లు వర్షం వల్ల రద్దయ్యాయి. ఇక ఇప్పటివరకు టి20 సిరీస్ లో సంచలన ఫలితాలే నమోదయ్యాయి. సూపర్ 12 మ్యాచ్ లు ముగిసిన నేపథ్యంలో రెండవ సెమిస్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ మధ్య నవంబర్ పదో తేదీ గురువారం అడిలైడ్ వేదికగా జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కి వర్షం ఆటంకం కలిగిస్తే పరిస్థితి ఏంటి? విజేతను ఎలా నిర్ణయిస్తారు?

రద్దయితే ఏం చేస్తారంటే
టి20 వరల్డ్ కప్ మెన్స్ సెమీఫైనల్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కి ఐసిసి రిజర్వ్ డే కేటాయించింది.. వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే మరుసటి రోజు నిర్వహిస్తారు.. తర్వాత రోజు కూడా వర్షం వల్ల ఆట సాధ్యం కాకపోతే కనీసం 5 ఓవర్ల పాటు అయినా మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. కనీసం 5 ఓవర్లు కూడా మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోతే సూపర్ 12లో పాయింట్స్ పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.. ఇక ఫైనల్ మ్యాచ్ కి కూడా రిజర్వ్ డే ఉంది. ఆరోజు కూడా వాన వల్ల మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోతే కనీసం 10 ఓవర్ల ఆట కొనసాగాలి. ఫైనల్ లోనూ ఇదే పరిస్థితి 10 ఓవర్ల ఆట కూడా కొనసాగకపోతే రెండు జట్లు టైటిల్ షేర్ చేసుకుంటాయి. మ్యాచ్ ల ప్రారంభానికి ముందే ముందే ఇరుజట్లు కెప్టెన్లు ఈ నిర్ణయం తీసుకుంటారు.
భారత్ చేరడం పక్కా
కివీస్, పాక్ మధ్య జరిగే తొలి సెమీస్ కు వర్షం అడ్డ తగిలితే రిజర్వ్ డే రోజున మ్యాచ్ నిర్వహిస్తారు. ఆరోజు కూడా మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోతే సూపర్ 12లో మెరుగైన స్థితిలో నిలిచిన న్యూజిలాండ్ ఫైనల్ చేరుకుంటుంది. ఇక రెండో సెమిస్ లో భాగంగా భారత్, ఇంగ్లీష్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే రిజర్వ్ డే రోజున నిర్వహిస్తారు.. ఆరోజు కూడా మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోతే సూపర్ 12లో గ్రూప్ 2 లో టాపర్ గా నిలిచిన టీం ఇండియా ఫైనల్ చేరుతుంది.

వాతావరణం ఎలా ఉందంటే
ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం సెమీఫైనల్ మ్యాచ్లు జరిగే అడిలైడ్, సిడ్నీలో వానలు పడే అవకాశం లేదు. కానీ ఆస్ట్రేలియాలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అయితే పెద్ద వర్షం వచ్చినప్పటికీ మైదానాన్ని ఆటకు సిద్ధం చేసే పరిజ్ఞానం ఆస్ట్రేలియా వద్ద ఉంది. అడి లైడ్, సిడ్నీ, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియాల్లో అత్యున్నత పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉంది.. కాబట్టి వాన వల్ల మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు తక్కువే అని చెప్పాలి.