
IND vs AUS : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేసింది. బదులుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 571 పరుగులకు ఆలౌట్ అయింది. మొత్తంగా 91 పరుగుల లీడ్ లో నిలిచింది. నాలుగో టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్ లో 186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 14 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.. అవకాశాన్ని కోల్పోయాడు అనేకంటే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన కుట్రకు బలయ్యాడు అనడం కరెక్ట్.
వాస్తవానికి కోహ్లీ ఆడుతున్న తీరు చూస్తే ఎవరైనా డబుల్ సెంచరీ సాధిస్తాడు అనుకున్నారు. కానీ అతడు బ్యాటింగ్ వేగం పెంచే క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ కోహ్లీకి సరైన సహకారం ఇవ్వలేకపోయాడు. దీంతో డబుల్ సెంచరీ చేయాలనే తలంపుతో కోహ్లీ భారీ షాట్లు ఆడాడు. ఓ సారి భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద హాండ్స్ కోబ్ జార విడిచాడు. ఆ తర్వాత మర్ఫీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు కోహ్లీ యత్నించాడు. ఈసారి లబుషేన్ ఎటువంటి పొరబాటు చేయకుండా క్యాచ్ పట్టేశాడు. దీంతో 186 పరుగుల వద్ద కోహ్లీ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
కోహ్లీకి డబుల్ సెంచరీకి చేరువగా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ ఫీల్డింగ్ సరళిని పూర్తిగా మార్చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఏకంగా తొమ్మిది మంది ఫీల్డర్లను మోహరింపజేశాడు. మరో వైపు బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో భారీ షాట్లు ఆడి డబుల్ సెంచరీ పూర్తి చేయాలని విరాట్ భావించాడు. ఈక్రమంలోనే ఒక భారీ షాట్ ఆడి హాండ్స్ కోబ్ జారవిడవటంతో బతికిపోయాడు. కానీ ఆ వెంటనే మరో భారీ షాట్ ఆడబోయి లబుషేన్ చేతికి చిక్కాడు. 14 పరుగుల తేడా తో డబుల్ సెంచరీ కోల్పోయాడు. స్మిత్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఏర్పాటు చేసిన ఫిల్డింగ్ విధానం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
https://twitter.com/enthuaa/status/1634874462729572352?s=20