Money Plant Vastu: ఇంట్లో ఎప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని అనుకుంటారు. కుటుంబమంతా సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతారు. కానీ ఒక్కోసారి ఇంట్లోకిరాగానే చికాకు కలిగిస్తాయి. కొన్ని సార్లు అనవసరమైన గొడవలు వస్తుంటాయి. చేతిలో డబ్బులు లేక ఇబ్బందులకు గురవుతారు. ఈ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఈ విషయాన్ని ఇతరులకు చెబితే ఇంట్లో మనీ ప్లాంటు పెట్టుకోవాలని సూచిస్తారు. వెంటనే మనీప్లాంట్ తెచ్చుకొని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. కానీ ఇలా చేయడం వల్ ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనీప్లాంట్ ను సరైన దిశలో పెడితేనే దాని ప్రయోజనాలు ఉంటాయి. మరీ ఈ చెట్టుకు ఎక్కడ ఉంచాలి?
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే కలిసి వస్తుందని నమ్ముతారు. దీంతో చాలా మంది దీనిని ఇంట్లో ఉండేలా చూసుకుంటారు. కొంత మంది కార్యాలయాల్లో కూడా ఉంచుతున్నారు. శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ మొక్క చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది ఇంట్లో ఉండడవల్ల ఇంట్లో వాళ్లకు శక్తి వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా చెడు గాలిని పీల్చుకొని మంచి వాతావరణాన్ని ఇస్తుంది. అయితే దీనిని ప్రత్యేక ప్రదేశంలో మాత్రమే ఉంచాలి.
ఒక కుండీలో లేదా ఒక సీసాలో నిండుగా నీరు పోయాలి. ఇందులో మనీ ప్లాంట్ మొక్క వేసి ఇంట్లో ఆగ్నేయం వైపు ఉంచాలి. ఇలా పెట్టడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అయితే మొక్కను ఆగ్నేయంలో పెట్టి వదిలేయకూడదు. దీని ఆకు పసుపు రంగులోకి మారినప్పుడు వెంటనే కొత్త మొక్కను ఉంచాలి. విఘ్నేశ్వరుడికి బాగా ఇష్టమైన చెట్టు ఇది. అందువల్ల ఇది ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి. కొంతమంది ఈ విషయం తెలియక ఈశాన్యంలో ఉంచుతున్నారు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ఉన్నవాళ్లు అనారోగ్యానికి గురవుతారు.
ప్రసిద్ధ ఇండోర్ మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి ఇందులో గాలిని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి. మనీ ప్లాంట్ ను పెట్టుకోవడం వల్ల ఫార్మిల్డి హైడ్, బెంజీన్, జలీన్ వంటి విషాన్ని పీల్చుకొని స్వచ్ఛమైన వాతావరణాన్ని వదులుతాయి. దీంతో ఎక్కడైతే మనీ ప్లాంటును నెలకొల్పుతామో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందువల్ల మనీప్లాంట్ ను పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.