ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 8 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మొత్తం 8 ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, ప్రాజెక్ట్ అటెండెంట్ 1, జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 19,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బీటెక్/ఎమ్మెస్సీ/ఎంసీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈమెయిల్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
5g.bhartischool@gmail.com మెయిల్ కు ఈమెయిల్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.