https://oktelugu.com/

Etela Rajender: కేసీఆర్ ఇక నీ పని అయిపోయింది.. ఎమ్మెల్యే ఈటల సంచలన వ్యాఖ్యలు!

Etela Rajender: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవర్తన తీరు నియంతలా ఉందని ప్రతిపక్షాలు, సీనియర్ రాజకీయ నాయకులు, నిరుద్యోగులు , విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయినా కూడా ముఖ్యమంత్రిలో కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు. దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా సీఎం చేష్టలు ఉన్నాయని, దీంతో టీఆర్ఎస్ పాలనను ప్రస్తుతం చీదరించుకునేవారు రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతుండటమే కారణం.. సీఎం కేసీఆర్ ఎటువంటి వారు, ఆయన సీఎం కుర్చీ ఎక్కాక ఎలా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2021 10:54 am
    Follow us on

    Etela Rajender: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవర్తన తీరు నియంతలా ఉందని ప్రతిపక్షాలు, సీనియర్ రాజకీయ నాయకులు, నిరుద్యోగులు , విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయినా కూడా ముఖ్యమంత్రిలో కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు. దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా సీఎం చేష్టలు ఉన్నాయని, దీంతో టీఆర్ఎస్ పాలనను ప్రస్తుతం చీదరించుకునేవారు రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతుండటమే కారణం.. సీఎం కేసీఆర్ ఎటువంటి వారు, ఆయన సీఎం కుర్చీ ఎక్కాక ఎలా ఫీలవుతున్నారో ఉద్యమనేత, మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి చెప్పుకొచ్చారు..

    Etela Rajender

    Etela Rajender

    రాజకీయ డ్రామాలు..

    సీఎం కేసీఆర్ ఏది చేసినా రాజకీయంగా తనకు అనుకూలిస్తుందా? లేదా అని ఆలోచించాకే చేస్తారని చెప్పారు. నారాయణపేటలో మాట్లాడిన ఈటల.. రాష్ట్రంలో లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి.. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి ఆ నీటితో చెరువులు, కుంటలు నింపామని చెప్పుకునే కేసీఆర్ వరి ఎందుకు వేయొద్దన్నంటున్నారో చెప్పాలన్నారు. వరి వేయొద్దన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టారు.. కమీషన్ల కోసమేనా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పూర్తయితే తెలంగాణ దేశానికే అన్నం పెడుతుందని ప్రగాల్భాలు పలికిన కేసీఆర్..ఇప్పుడు రైతులను ధాన్యం ఎందుకు పండించొద్దని చెబుతున్నారో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి వేయమనేది నువ్వే.. వద్దు అనేది నువ్వే..ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టకపోవడంతో అకాల వర్షాలకు వడ్లు మొత్తం పాడై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నదని నీకు కనిపించడం లేదా అని మండిపడ్డారు. అన్నదాతల ఉసురుపోసుకున్నోడో ఎవరు బాగుపడలేదని ఫైర్ అయ్యారు.

    తెలంగాణకు రాజు అని ఫీలింగ్..

    రాష్ట్రానికి సీఎం అయ్యాక కేసీఆర్ తాను చక్రవర్తిలాగా ఫీలవుతున్నారని ఈటల విమర్శించారు. ఓ పక్క రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫీడెల్ వాయించినట్టు సీఎం కేసీఆర్ పని తీరు ఉందని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని తప్పుబడుతున్నారని..రెండేళ్ల కిందటే దేశంలో పారా బాయిల్డ్ రైస్ ఇక కొనేది లేదని కేంద్రం చెప్పినప్పుడు తలఊపిన కేసీఆర్.. ఇప్పుడు సొంత లాభం కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు అవ్వడం లేదని చెప్పుకునే మీకు ధాన్యం కొనుగోలు చేయడం రాదా? అని ప్రశ్నించారు.

    Also Read: CM KCR: బీజేపీనే టార్గెట్ చేస్తున్న కేసీఆర్.. బీజేపీయేతర పక్షాలతో భేటీ

    తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై ప్రజలకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చిందన్నారు. అందుకే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కేసీఆర్ పాలన మీద, టీఆర్ పార్టీపై 75శాతం మంది ప్రజలు వ్యతిరేకత చూపించారని మరోసారి గుర్తుచేశారు. కళ్లముందు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బంగారు తెలంగాణ ఎలా సాధిస్తావ్ అని ఈటల కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా కళ్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేసి, చనిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పని ఇక అయిపోయిందని వచ్చే ఎన్నికల్లో ఫామ్ హౌస్‌‌కే పరిమితం అవ్వడం ఖాయమని ఈటల జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను ఇబ్బందులు పెట్టిన కేసీఆర్‌కు ప్రజలు తప్పకుండా తగిన బుద్ది చెబుతారని ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.

    Also Read: Shilpa Choudhary: కిలాడీ లేడీ.. తేలని కోట్ల గారడీ

    Tags