Atal Pension Yojana scheme : కేవలం రూ.376 కడితే.. నెలకు రూ.5 వేల పింఛన్‌.. ఎలా వస్తాయో తెలుసా?

40 ఏళ్ల వారు అయితే నెలకు రూ.1,454 చెల్లించాలి. ఇది ఆటో ఆప్షన్‌గా పెట్టుకుంటే మన బ్యాంకు ఖాతా నుంచి కట్‌ అవుతాయి. మనకు 60 ఏళ్లు నిండగానే నెలనెలా రూ.5 పెన్షన్‌ పొందవచ్చు.

Written By: NARESH, Updated On : March 4, 2024 4:11 pm
Follow us on

Atal Pension Yojana scheme : రూ.376.. చాలా చిన్న మొత్తం. కానీ, నెలనెలా ఈ రూ.376 కడితే నెలకు రూ.5 వేల పింఛన్‌ పొందవచ్చు. అదెలా అంటారా.. అదే అటల్‌ పెన్షన్‌ యోజన స్కీం. ఈ పథకం పేరు చాలా మంది వినే ఉంటారు. కానీ దాని ప్రయోజనం గురించి చాలా మందికి తెలియదు. తెలిసన వారు కూడా పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కానీ, ఇలాంటి పథకం గతంలో ఎన్నడూ లేదు. అదెలానో తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వ స్కీం..
అటల్‌ పెన్షన్‌ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ స్కీం. ఈ స్కీంలో కొంత డబ్బులు నెలనెలా కడితే నెలకు రూ.5 వేల పెన్షన్‌ వస్తుంది. ఇది మన బ్యాంకు ఖాతా నుంచి నెలనెలా డిడెక్ట్‌ అయ్యేలా చేసుకుంటే సరిపోతుంది. మనకు తెలియకుండానే నెలనెలా డబ్బులు పథకంలో జమ అవుతాయి. మనకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత బ్యాంకును సంప్రదిస్తే నెలకు రూ.5 వేల చొప్పున పింఛన్‌ మన ఖాతాలో జమ చేస్తుంది.

ఎవరు అర్హులు..
ఇక ఈ అటల్‌ పెన్షన్‌ యోజన పథకానికి 18 నుంచి 40 ఏళ్లలోపు స్త్రీ, పురుషులు అర్హులు. భారతీయులై ఉండాలి. బ్యాంకు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. నెలనెలా మన ఖాతాలోని డబ్బు మన ఏజ్‌ ఆధారంగా కట్‌ అవుతుంది.

ఎవరికి ఎంత..
ఇక అటల్‌ పెన్షన్‌ యోజన కోసం ఎవరు ఎంత కట్టాలి అంటే 18 ఏళ్ల వయసు వారు నెలకు కేవలం రూ.210 చెల్లిస్తే సరిపోతుంది. ఇక 25 ఏళ్ల వయసు వారు అయితే రూ.376 చెల్లించాలి. ఇక 35 ఏళ్ల వయసు వారు అయితే నెలకు రూ.902 చెల్లించాలి. 40 ఏళ్ల వారు అయితే నెలకు రూ.1,454 చెల్లించాలి. ఇది ఆటో ఆప్షన్‌గా పెట్టుకుంటే మన బ్యాంకు ఖాతా నుంచి కట్‌ అవుతాయి. మనకు 60 ఏళ్లు నిండగానే నెలనెలా రూ.5 పెన్షన్‌ పొందవచ్చు.