Habits : జీవితంలో పైకి ఎదగాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అందుకు వారికి ఉన్న ప్రత్యేక అలవాట్లు అని గుర్తుంచుకోవాలి. అయితే ఈ అలవాట్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కొందరు మాత్రమే పాటిస్తారు. అలా పాటించిన వారు తమ తెలివితేటలను ప్రదర్శించి గుర్తింపు పొందుతారు. అయితే తెలివితేటలు అనేది ఎవరి సొత్తు కాదు. సాధన చేస్తే ఎవరికైనా తెలివి వస్తుంది. ఈ తెలివి రావాలంటే ఏం చేయాలి? అంతేకాకుండా మిగతా వారి కంటే ప్రత్యేకంగా గుర్తింపు పొందాలంటే ఎలాంటి అలవాట్లను కలిగి ఉండాలి? అనే వివరాల్లోకి వెళితే..
తెలివితేటలు ఎక్కువగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసుకు ఇష్టమైన పనులు చేయాలి. ఇవి ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేవిధంగా చూడాలి. అంటే కొన్ని పనుల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడమే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండి క్రియేటివిటీని పెంచుతాయి. ఇందుకోసం కొన్ని అలవాట్లను చేసుకోవాలి.
Also Read : ఈ అలవాట్లు మీలో ఉంటే.. మెదడు దెబ్బతినడం ఖాయమే!
వీటిలో మొదటిది మ్యూజిక్ వినడం. చాలామందికి సంగీతం వినడం అంటే ఇష్టమే. కానీ మనసుకు హాయిని ఇచ్చే సంగీతం వినడం ద్వారా మెదడు ప్రశాంతంగా మారుతుంది. దీంతో మంచి ఆలోచనలు వస్తాయి. ఫలితంగా ఏదైనా ఒక పనిని చేయాలంటే అందుకు సరైన విధంగా మెదడు పనిచేస్తుంది. దీంతో కొత్త ఆలోచనలు వచ్చి ప్రత్యేక గుర్తింపు పొందుతారు.
మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. ప్రతిరోజు 8 గంటలు నిద్రపోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.అయితే పనులు మానుకొని కాకుండా సమయానికి నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేసే క్రియేటివిటీని పెంచుతాయి. దీంతో కొత్త ఆలోచనలు వచ్చి నైపుణ్యాలను ప్రదర్శించేందుకు వీలుగా ఉంటుంది. అందువల్ల సరైన నిద్ర పోవడానికి ప్రయత్నించాలి.
కొంతమంది గృహిణులు ఇంట్లో ఉంటూ మానసికంగా ఆందోళనలతో కలిగి ఉంటారు. అయితే మరికొందరు ఉద్యోగం చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో తెలివితేటలు పెరగాలంటే ఇష్టమైన వంటలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ఒకే రకమైన వంట కాకుండా కొత్త రకమైన వంటలను ప్రయత్నించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా రుచికరమైన వంటలు తినడం వల్ల మానసికంగా హాయినిచ్చి మంచి ఆలోచనలు కలిగేలా చేస్తుంది.
చాలామందికి డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ కొందరికి బిడియం ఎక్కువగా ఉండి డాన్స్ చేయడానికి ఆసక్తి చూపరు. అయితే ప్రతి రోజు ఒక గంట పాటు ఇంట్లోనైనా డాన్స్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు డాన్స్ చేయడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది. దీంతో తెలివితేటలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
కొంతమందికి ఎక్కువగా మాట్లాడడం అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా తమకిష్టమైన వారితో కలిసి ఉండడం అంటే ఇష్టం. ఇలా ఇష్టమైన వారితో ఎప్పుడూ మాట్లాడడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలతో నైపుణ్యాలను ప్రదర్శించవచ్చు.
Also Read : అబ్బాయిల ఈ 3 అలవాట్లు అమ్మాయిలకు పిచ్చెక్కిస్తాయి..