Four Habits : జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. కానీ కొందరికి సరైన సౌకర్యాలు లేక.. అనువైన ఆరోగ్యం లేక గమ్యం చేరుకోలేకపోతుంటారు. అయితే తమకు అనుకూలంగా వాతావరణ ఉంటే లక్ష్యం పూర్తి చేస్తామని కొందరు చెబుతూ ఉంటారు. కానీ సౌకర్యాలు, పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చుకొని అనుకున్న పనులను త్వరగా పూర్తి చేయాలి. అప్పుడే జీవితంలో విజయాలు సాధిస్తారు. అయితే కొన్ని సౌకర్యాలు చిన్నవే అయినా వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల లక్ష్యాలు సాధించడంలో ఆటంకాలుగా మారుతాయి. ఇవి ఆటంకాలుగా మారకుండా ఉండాలంటే ఆ చిన్న అలవాట్లను చేసుకోవాలి. అవేంటంటే?
Also Read : ఈ అలవాట్లు మీలో ఉంటే.. మెదడు దెబ్బతినడం ఖాయమే!
వాయిదా:
కొంతమంది ఒక పనిని ప్రారంభించి దానిని వెంటనే పూర్తి చేయడానికి ముందుకు రారు. రేపు చూద్దాంలే.. అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలా అన్ని పనులను వాయిదా వేస్తూ ఏ పనిని పూర్తి చేయలేకపోతుంటారు. అందువల్ల ఒక పనిని అనుకుంటే దానిని కచ్చితంగా అదే రోజు పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. అలా చేయడం వల్ల పనులు పెండింగ్లో ఉండకుండా త్వరగా పూర్తవుతాయి. ఫలితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు.
జ్ఞానం:
కొందరు కొన్ని విజయాలు సాధించగానే తాము ఇక జీవితంలో అన్ని సాధించినట్లే అని అనుకుంటారు. కానీ ఎంత నేర్చుకున్నా తక్కువే అనే భావనతో ఉండాలి. ఎందుకంటే కొత్త విషయాలు నేర్చుకునే క్రమంలో కొత్త దారులు పుడుతూ ఉంటాయి. ఇవి జీవితానికి అనుకూలంగా మారే అవకాశం. అందువల్ల కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవాలి.. కొత్త ప్రదేశాలకు వెళ్లాలి.. కొత్త ఆలోచనలు చేసి మంచి జ్ఞానాన్ని పొందాలి. అప్పుడే జీవితంలో గమ్యాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా ఎదుటివారికి కొన్ని ప్రశ్నలు వేసి వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించుకోవాలి. కొత్త సమాచారాన్ని సేకరించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఆరోగ్యం:
నేటి కాలంలో చాలామంది విధులు నిర్వహించే క్రమంలో ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేయడం వల్ల చేసే పనిలో దృష్టి ఉండదు. ఫలితంగా గమ్యానికి చేరడానికి సరైన దారులు ఉండవు. అందువల్ల ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు సక్రమముగా ఆహారం తినడం.. ఇది టైం టు టైం ఉండడం వల్ల మరింత మంచిది. ప్రస్తుత కాలంలో ఇంట్లో కంటే బయట ఫుడ్డు ని ఎక్కువగా తింటున్నారు. ఇలా కాకుండా ఇంట్లోనే వండిన ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా ఉండాలి.
Also Read : అబ్బాయిల ఈ 3 అలవాట్లు అమ్మాయిలకు పిచ్చెక్కిస్తాయి..
ఏకాగ్రత:
ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు దానిపై ప్రత్యేక దృష్టి సాధించాలి. అలా చేయని పక్షంలో ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయలేరు. అయితే కొందరు మూడు రకాల పనులు ఒకేసారి మొదలుపెట్టి దేనిని పూర్తి చేయకుండా ఉంటారు. అరే కాకుండా ఒక పనిని ప్రారంభించి దానిమీద దృష్టి పెడితే అనుకున్నది సాధిస్తారు. ఇందుకోసం ఏకాగ్రత కచ్చితంగా అవసరం ఉంటుంది.