Feelings : ఈ ఫీలింగ్స్ మీలో ఉంటే.. కొన్ని అవయవాలు పాడైపోతాయి.. జాగ్రత్త

లేదా కుటుంబ సభ్యులతో కలిసి నెలకు ఒకసారైనా విహార యాత్రలకు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల రిలేషన్ షిప్ పెరుగుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారి ఎలాంటి స్ట్రెస్ ను అయినా తట్టుకుంటారు.

Written By: NARESH, Updated On : October 20, 2024 9:42 pm

Feelings, some organs will be damaged

Follow us on

Feelings : జీవితం అంటే పూల పాన్పు కాదు.. ఎన్నో రకాల కష్టాలు, బాధలను ఎదుర్కోవాలి. ఒక్కోసారి భరించలేని కష్టం వస్తుంది. కొన్ని రోజుల పాటు దు:ఖం ఉంటుంది. అయితే భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బాధపడాల్సిందే. కానీ నిత్యం బాధపడుతూ కూర్చోవడం వల్ల సమస్యలు పరిష్కారం కాదు. అంతేకాకుండా ఎప్పటికీ ఇలా బాధలో మునిగిపోవడం గానీ.. ప్రతీ దానికి కోపం తెచ్చుకోవడం గానీ.. అరుస్తూ ఉండడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా స్ట్రెస్ తో కూడిన పనులు చేయడం వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు చెడిపోతాయి. అదెలాగంటే?

కొందరు చిన్న విషయానికే బాధపడుతూ ఉంటారు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఫీలవుతూ ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా వినరు. ఇతరులను చూసి ధైర్యం తెచ్చుకోవడానికి ఇష్టపడరు.ఇలాంటి వారు ఎప్పుడూ బాధపడుతూ ఉండడం వల్ల ఈ ప్రభావం ఊపిరి తిత్తులపై పడుతుంది. కొన్ని రోజుల బాధతో ఉన్నవాళ్లలో మిగతా వారి కంటే సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కొందరు ప్రతీదానికి కోపం తెచ్చుకుంటారు. నిత్యం చిరాకుగా ఉంటారు. మనసు ప్రశాంతగా అస్సలు ఉంచుకోలేరు. ఇలాంటి వారికి ఎక్కువగా కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని పనుల కారణంగా చిన్న వారి నుంచి పెద్దవారి వరకు నిత్యం స్ట్రెష్ తో బాధపడుతున్నారు. ఇలాంటి వారి శరీరంలో గుండె సమస్యలు వస్తాయి. అలాగే బ్రెయిన్ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఇక ప్రతీ విషయానికి భయపడుతూ ఆందోళనగా ఉంటే అలాంటి వారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కొందరికి రక్త ప్రసరణ జరిగ్గా కాకుండా దీర్ఘ కాలిక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సరైన నిద్ర లేకపోవడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురవుతారు.

అందువల్ల చాలా మంది నెగెటివ్ ఫీలింగ్స్ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. నెగెటివ్ ఎమోషన్స్ నుంచి దూరంగా ఉండడానికి రిలాక్స్ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టమైన సంగీతం వినాలి.. నచ్చిన సినిమా చూడాలి.. ఇష్టమైన ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు మెడిటేషన్, వాకింగ్ కచ్చితంగా చేయాలి. ఇలా చేయడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. అప్పుడు ఎటువంటి నెగెటివ్ ఫీలింగ్స్ ఉండవు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శరీరానికి హాని కలిగించే పదార్థాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.

ప్రస్తుత కాలంలో చాలా మంది రిలేషన్స్ కు దూరంగా ఉంటున్నారు. అయితే ముఖ్యంగా ఇష్టమైన వాళ్లతో ఎక్కువగా కలిసి ఉండడానికి ఇష్టపడాలి. అప్పుడు మీలోని బ్యాడ్ షేడ్స పారిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి వ్యాయామం లేకుండా ఇలా స్నేహితులు, బంధువులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు.. అంతేకాకుండా నచ్చిన వారితో స్పోర్ట్స్ ఆడడం అలవాటు చేసుకోవాలి. లేదా కుటుంబ సభ్యులతో కలిసి నెలకు ఒకసారైనా విహార యాత్రలకు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల రిలేషన్ షిప్ పెరుగుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారి ఎలాంటి స్ట్రెస్ ను అయినా తట్టుకుంటారు.