Relationship : ఒకరిని లవ్ చేస్తున్నా? ఇష్టపడుతున్నా వారి లైఫ్ ను మీ చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ అంటారా? ప్రస్తుతం ఇష్టపడుతున్న పర్సన్ ను కంట్రోల్ లో పెట్టడం ఎక్కువగా గమనిస్తున్నాం. ఈ సమస్య వల్ల పూర్తి రిలేషన్ దెబ్బతింటుంది. ఎవరి లైఫ్ లో అయినా లిమిట్స్ అనేవి చాలా కీలకం. హద్దులు మీరితే వచ్చే కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేటి తరంలో చాలా మంది రిలేషన్‌షిప్‌లో మరొకరికి ఎంత స్పేస్ మెయింటెన్ చేయాలో తెలియడం లేదు. దీంతో చిక్కులు తెచ్చుకుంటున్నారు. అయితే అవి ఎంత ముఖ్యమో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
రిలేషన్‌షిప్‌లో రహస్యాలు లేదా అబద్ధాలు ఉండకూడదు అని చాలా మంది చెబుతుంటారు. కానీ చాలా మంది వాటిని సరిహద్దులతో గందరగోళానికి గురిచేస్తుంటారు. మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒకరి జీవితం గురించి మరొకరు తెలుసుకోవటం ఆసక్తి ఉంటుంది. మీరు డీప్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకోవడం సహజంగా చేస్తుంటారు. కానీ ప్రేమలో పడితే మీ వ్యక్తిత్వానికి, పర్సనల్ స్పేస్ కు పూర్తి-స్టాప్ పెట్టడం మంచిది కాదు అని గుర్తు పెట్టుకోండి. సరిహద్దును నిర్వహించడం ముఖ్యం. అంటే ఏ విషయంలో అయినా పరిమితులను సెట్ చేయడం, పర్సనల్ స్పేస్ కలిగి ఉండటం చాలా అవసరం.
హద్దులను సెట్ చేయడం అంటే మీరు అవతలి వారిని దూరంగా పెట్టడం కాదు. కొన్ని విషయాల పట్ల భద్రత అవసరం కాబట్టి పాటించాలి. పైగా ఇది అవతలి వ్యక్తికి కూడా పర్సనల్ స్పేస్ ఇవ్వటానికి మీకు, వారికి సహాయపడుతుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు హద్దులను సెట్ చేసుకోవటం బంధాన్ని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీరు ఒకరికొకరు వ్యక్తిగతంగా ఎదగడానికి అవసరమయ్యే స్పేస్, సమయాన్ని అందించిన వారు అవుతారు.
ఇలా చేయడం వల్ల ఒకరిపై మరొకరికి విశ్వాసం పెరుగుతుంది. సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. హద్దుల్లో ఉంటే మీరు స్వతంత్రంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. లేదంటే ఇంకొకరి చేతలో కీలు బొమ్మ అయ్యాను అని బాధ పడతారు. ఇది మీ వ్యక్తిగత ఎదుగుదలను దెబ్బతీస్తుంది. అందుకే భాగస్వామితో తెలియకుండానే ఎక్కువ స్పేస్ కోరుకుంటారు. సో అలా చేయవద్దు. దీని వల్ల మీ స్వంత అవసరాలు, విలువలను గౌరవించడంలో మీకు సహాయపడుతుంది. పైగా రిలేషన్‌షిప్‌లో అనవసరమైన గొడవలు, గందరగోళాలు ఉండవు.
మీరు రిలేషన్‌షిప్‌లో హద్దులు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఒకరినొకరు అర్థం చేసుకుని, ఆశయాలు, లక్ష్యాలను సాధించడానికి ఒకరికొకరు సమయంతో పాటు తగిన స్పేస్ ఇస్తుంటారు కూడా. ప్రస్తుత సమాజంలో చాలా మంది తమ రిలేషన్‌షిప్‌లను ఈహద్దులు మరచిపోవటంతో ఇబ్బందులు వచ్చి విడిపోతున్నారు కూడా. సో ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..