Health Tips: తలనొప్పితో ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరూ బాధపడతారు, అయితే ఇది తాత్కాలికమైన ఇబ్బందే. సాధారణంగా తలనొప్పులు తాత్కాలికం, అవి వాటంతటవే పోతాయి. కానీ, నిజానికి తలనొప్పి విషయంలో అస్సలు నిర్లక్ష్యం గా ఉండకూడదు. తలనొప్పి తీవ్రంగా ఉన్నా.. మళ్ళీ మళ్ళీ వస్తున్నా వెంటనే పరీక్షించుకోవాలి. కొన్ని తలనొప్పులు ఏదో తీవ్రమైన స్ధితికి సంకేతాలు లాంటివి. వాటికి తక్షణం వైద్యసాయం అవసరమవుతుంది.

మీలో ఈ క్రింది తలనొప్పి లక్షణాలను కనుక ఉంటే.. . మీకు అత్యవసరంగా వైద్య సహాయం అవసరం అని గుర్తించండి.
Also Read: బీసీసీఐ సన్మానం అక్కర్లేదన్న కోహ్లీ.. ఈ విధంగా షాక్ ఇచ్చాడా..!
తీవ్రమైన, ఆకస్మికంగా వచ్చే తలనొప్పి, అలాగే వేగంగా, చెప్పలేని విధంగా వచ్చే తలనొప్పి, ఇక స్పృహ తప్పడం, గందరగోళం, కంటి చూపులో మార్పులు లేదా ఇతర శారీరక బలహీనతలతో కూడిన తలనొప్పి.. అలాగే, మెడ బిగుసుకుపోవటం మరియు జ్వరంతో కూడిన తలనొప్పి వంటి తల నొప్పి లక్షణాలను కనుక మీరు అనుభవిస్తుంటే.. మీకు వైద్య సహాయం అవసరం.

అలాగే నిద్ర నుంచి మిమ్మల్ని మేల్కొలిపే తలనొప్పి లేదా తరచూ ఎందుకొస్తుందో వివరించలేని మార్పులు మీ తల నొప్పి స్వభావం అయితే గనుక వైద్యుడిని సంప్రదించటం చాలా ఉత్తమం. ఆందోళన, క్లస్టర్ తలనొప్పి, పార్శ్వశూల అనేవి తలనొప్పులలోని రకాలు. పార్శ్వశూల అనేవి రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులు. ఈ రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో భౌతిక శ్రమ తలనొప్పి బాధను అధికం చేస్తుంది.
తల చుట్టూ ఉండే కణజాలం లోని రక్తనాళాలు ఉబ్బుతాయి లేదా వాస్తాయి. దానివల్ల తల నొప్పితో బాధపడుతుంది. అన్నిరకాల తలనొప్పులలో ఆందోళన వల్ల కలిగే తలనొప్పులు 90 శాతం ఉంటాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Also Read: గాడిద.. జర్నలిస్టుకే తెలుగు నేర్పిన బాలయ్య.. వీడియో వైరల్