PF Money Withdraw: దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నారు. పీఎఫ్ ఖాతాదారులు ఏవైనా ఇబ్బందులు ఎదురైన సమయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి ఏకంగా లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఈ డబ్బును తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆస్పత్రిలో చేరినట్టు ఆధారాలను సబ్మిట్ చేయడం ద్వారా ఈ విధంగా డబ్బును పొందవచ్చు.
www.epfindia.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ అడ్వాన్స్ క్లయిమ్ అనే ఆప్షన్ సహాయంతో ఈ డబ్బును విత్ డ్రా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface ఆప్షన్ ను ఎంచుకుని ఆన్ లైన్ సర్వీసెస్ క్లెయిమ్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంది. ఆ తర్వాత బ్యాంకు ఖాతా నంబర్ ను ఎంటర్ చేసి ఆ నంబర్ సరిగ్గా ఎంటర్ చేశామో లేదో వెరిఫై చేసుకోవాలి.
Also Read: రామ్ పోతినేనితో పరిణితి చోప్రా రొమాన్స్.. నిజమేనా ?
ఆ తర్వాత ఆన్ లైన్ క్లెయిమ్ కొరకు ప్రొసీడ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి ఆ తర్వాత పీఎఫ్ అడ్వాన్స్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైన మొత్తాన్ని, చెక్ స్కాన్డ్ కాపీని అందజేయాలి. ఆ తర్వాత అడ్రస్ ను నమోదు చేసి ఆధార్ వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. మొబైల్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా క్లెయిమ్ ను దాఖలు చేయవచ్చు.
గతంలో మెడికల్ బిల్లులను డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ సర్వీసులను పొందే అవకాశం ఉండేది. ఇప్పుడు మాత్రం ఎలాంటి బిల్లులు ముందుగా అందజేయకుండా సులభంగా ఈ సర్వీసులను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: ‘రాధేశ్యామ్’ ప్రోమో అదిరింది.. పూజా – ప్రభాస్ కెమిస్ట్రీ కేక