Vastu Tips: పూలంటే అందరికి ఇష్టమే. అవి చూడటానికి కూడా ఎంతో ముచ్చటగా కనిపిస్తాయి. ఇంట్లో పూల మొక్కలు పెంచుకుంటే ఇల్లే నందనవనంగా కనిపిస్తుంది. దీంతో పూల మొక్కల పెంపకం అందరికి అలవాటుగా మారుతోంది. పచ్చదనం, ప్రశాంతత నింపే పూల మొక్కలు ఇంటి పరిసరాల్లో పెంచుకోవడం మంచిది. పూల మొక్కలు జీవితంలో సంపద, సంతోషాలు కలగడానికి కారణాలవుతాయని మన వారి విశ్వాసం. అందుకే ప్రతి ఇంటిలో పూల మొక్కలు పెంచుకోవడం అదృష్టంగా భావిస్తుంటారు. ఇంటి ముందు ఉండే పూల మొక్కల నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీతో మనశ్శాంతి, అదృష్టం, ధనం కలిగేందుకు దోహదపడతాయని నమ్మకం.

మల్లెపూలంటే అందరికి ఎంతో మక్కువ. వాటి నుంచి వచ్చే వాసన పిచ్చెక్కిస్తుంది. అందుకే ప్రతి ఇంటిలో మల్లె చెట్టు ఉంచుకోవడం కనిపిస్తుంది. మల్లెల్లో మనసును ప్రశాంతంగా ఉంచే గుణం ఉంటుంది. మానసిక, శారీరక సమస్యల్ని దూరం చేయడంలో ఇవి ఎంతో సాయపడతాయి. వీటి నుంచి వచ్చే వాసనకు చెడు వాసనలు దరిచేరవు.
శాంతికలువ పూలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇవి శాంతి మార్గాన్ని నిర్దేశిస్తాయి. వీటిని పీస్ లిల్లీస్ గా పిలుస్తుంటారు. మనకు అదృష్టం, సంపద కలిగేందుకు ఇవి తోడ్పడతాయి. లక్కీ ప్లాంట్స్ గా ఇవి ఎంతో ఆహ్లాదకరమైన విధంగా ఉంటాయి. గాలిని శుద్ధి చేసి ఇంట్లో అదృష్టం కలిగించేందుకు ఇవి ఉపకరిస్తాయి. ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయి. గాలిని క్లియర్ చేసి మనకు మంచి ఆక్సిజన్ అందేందుకు సహకరిస్తాయి.
దేవ కనగిలే మొక్క కూడా మనకు అదృష్టాన్ని కలిగించేదిగా చెబుతారు. కామదేవుడికి ఇచ్చే పూలలో ఇవి కూడా ఉంటాయి. వాస్తు ప్రకారం ఇంటి ముందు ఈ మొక్కలు నాటితే ఆనందాలు కలుగుతాయి. తామర మొక్క కూడా మంచిదే. దీన్ని లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తాం. దీంతో మనకు మనశ్శాంతి, ధనప్రాప్తి వరిస్తుందని విశ్వసిస్తారు.

మందారం కూడా మనకు మంచి శకునాలే ఇస్తుంది. అత్యంత శుభప్రదంగా చూస్తారు. కాళీమాత ఆశీర్వాదాలు ఉంటాయి. మందారం మొక్కను ఉత్తరం లేదా తూర్పు దిక్కులో నాటుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కారబంతి మొక్క కూడా అందమైన పూలు ఇస్తుంది. దీన్ని కూడా తూర్పు లేదా ఉత్తరం దిక్కులో నాటుకోవాలి. వీటిని ఎంత ఎక్కువగా పెంచుకుంటే అంత మంచి జరుగుతుంది.
పూలలో గులాబీలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ మొక్కలు అదృష్టాన్ని తీసుకొస్తాయి. ప్రతికూల శక్తులను దూరం చేస్తాయి. ఇంటి యజమానికి ఎన్నో రకాల మేలు కలిగిస్తాయి. అర్కిడ్ లు కూడా మంచి కలిగించే పుష్పాలుగా చూస్తారు. ఆర్కిడ్లు పెంగ్ షుయ్లో అద్భుతమైన సంబంధాలు, సంతోషం, సంతానోత్పత్తిని సూచిస్తాయి. వీటిని ఇంటికి ఉత్తరం వైపు నాటుకుంటే శ్రేయస్కరం. ఇలా పూల మొక్కలను మన ఇంటి ఆవరణలో పెంచుకుని అదృష్టాన్ని తెచ్చుకునేందుకు కారకులం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.