Aadhaar: వీరికి ‘ఆధార్’ నెంబర్ ఇస్తే ప్రమాదంలో పడినట్లే.. జాగ్రత్త…

ఇలాంటి సమయంలో ఆధార్ కార్డును కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు ఆధార్ నెంబర్లను తస్కరించి వారికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. ఆ పై వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బలు దోచేస్తున్నారు.

Written By: Srinivas, Updated On : September 14, 2023 6:25 pm

Aadhaar

Follow us on

Aadhaar: నేటి కాలంలో ప్రతి ఒక్కరి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును జారీ చేస్తుంది. జారీ చేసిన కార్డులో 12 అంకెలున్న గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నారు. ఈ అంకెల ఆధారంగానే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు వెల్లడవుతున్నాయి. పేదవారి నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికీ ఒకేరకమైన ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు లేకుండా ఏ పనులు జరగడం లేదు. దీని ద్వారానే ప్రతీ వ్యవహారాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లు, పాన్ కార్డులు తదితర వివరాలన్నీ ఆధార్ కార్డుతో లింక్ చేశారు. అందువల్ల ఇప్పుడు ఆధార్ నెంబర్ ఇస్తే చాలు వ్యక్తి వివరాలు బయటకు వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ఆధార్ కార్డును కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు ఆధార్ నెంబర్లను తస్కరించి వారికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. ఆ పై వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బలు దోచేస్తున్నారు. వారి అడ్రస్ లను తెలుసుకొని వారి పేరిట చెడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందువల్ల ఆధార్ కార్డును సక్రమంగా వినియోగించుకోలి. ఈ తరుణంలో దీనిని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీచోట ఆధార్ కార్డు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.

అయితే ఆధార్ కార్డు లేకుండా గుర్తింపు లేదు. అందువల్ల ప్రతీ పనికి అధార్ కార్డు తప్పనిసరి. కానీ కొన్నిచోట్లు ఆధార్ కార్డుకు సంబంధించిన పూర్తి నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఇవ్వకుండా కూడా మీ పనులు చేసుకోవచ్చు. అదెలాగంగటే.. మొబైల్ లో క్రోమ్ ఓపెన్ చేసి ఆధార్ కార్డు డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి. ఇలా ఎంట్రీ చేసిన తరువాత యూఏఐడీ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆధార్ డౌన్లోడ్ ఆప్షన్ లోకి వెళ్లాలి.

అయితే డౌన్లోడ్ చేసే ముందు ‘మాస్క్’ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మాస్క్ ఆధార్ లో చివని నాలుగు నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. మిగతా నెంబర్లు xxxx xxxx 1234 ఇలా ఉంటాయి. అయతే వీటిని సంబంధిత ప్రదేశాల్లో ఒప్పుకుంటారా? అనే సందేహం రావొచ్చు. కానీ ఈ నెంబర్ కింద VOT అనే లెటర్స్ పక్కన ఐడీ ఇస్తారు. దీనితో గుర్తింపు కార్డుగా భావించవచ్చు. అయితే బ్యాంకు, ఇతర కార్యాలయాల్లో మాత్రం తప్పనిసరిగా ఫుల్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హోటళ్లు, ఇతర ప్రదేశాల్లో ఈ మాస్క్ ఆధార్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ మాస్క్ ఆధార్ ను కేంద్రమే అధికారికంగా జారీ చేస్తుంది.